Oscars 2025 Winner Full List: ఆస్కార్ 2025 లిస్ట్: అనోరా మూవీకి ఐదు అవార్డులు.. బేకర్‌కే నాలుగు.. ఉత్తమ నటుడిగా బ్రాడీ-oscars 2025 winners full list updates 97th academy awards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oscars 2025 Winner Full List: ఆస్కార్ 2025 లిస్ట్: అనోరా మూవీకి ఐదు అవార్డులు.. బేకర్‌కే నాలుగు.. ఉత్తమ నటుడిగా బ్రాడీ

Oscars 2025 Winner Full List: ఆస్కార్ 2025 లిస్ట్: అనోరా మూవీకి ఐదు అవార్డులు.. బేకర్‌కే నాలుగు.. ఉత్తమ నటుడిగా బ్రాడీ

Oscars 2025: ఆస్కార్ 2025 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్ఏంజిల్స్ వేదికగా గ్రాండ్‍గా జరిగింది. అనోరా చిత్రం దుమ్మురేపింది. ఐదు అవార్డులను దక్కించుకుంది. అవార్డుల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.

Oscars 2025 Winner Full List: ఆస్కార్ 2025 లిస్ట్: అనోరా చిత్రానికి ఐదు అవార్డులు.. ఉత్తమ నటుడిగా బ్రాడీ (REUTERS)

ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల ప్రదానోత్సవం అమెరికా లాస్‍ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో కళ్లు చెదిరేలా జరిగింది. 2024లో వచ్చిన చిత్రాలకు గాను ఈ 97వ అకాడమీ అవార్డుల వేడుక సాగింది. హాలీవుడ్ సినీ స్టార్లు ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. అవార్డుల ఈవెంట్ వేడుకలా సాగింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ఈవెంట్‍కు కొనాన్ ఓబ్రెయిన్ హెస్ట్ చేశారు. అదిరిపోయే పర్ఫార్మెన్సులు అలరించాయి. 'అనోరా' చిత్రానికి ఐదు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఇందులో ఈ మూవీకి గాను బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమా, బెస్ట్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకున్నారు సీన్ బేకర్.

భారత షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’కు ఆస్కార్ 2025 అవార్డుల్లో నిరాశ ఎదురైంది. డ్యూన్ పార్ట్ 2 మూవీకి రెండు అవార్డులు దక్కాయి. ఆస్కార్ 2025 అవార్డుల విజేతల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.

ఆస్కార్ విన్నర్స్ లిస్ట్

  • బెస్ట్ సినిమా - అనోరా
  • బెస్ట్ యాక్టర్ - యాడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
  • బెస్ట్ నటి - మైకీ మ్యాడిసన్ (అనోరా)
  • బెస్ట్ డైరెక్టర్ - సీన్ బేకర్ (అనోరా)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)
  • బెస్ట్ సపోర్టింగ్ నటి - జోయీ సాల్దానా (ఎమిలియా పెరెజ్)
  • బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‍ప్లే - అనోరా (సీన్ బేకర్)
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ - ది బ్రూటలిస్ట్
  • బెస్ట్ ఎడిటింగ్ - అనోరా (సీన్ బేకర్)
  • బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ - డ్యూన్ పార్ట్ 2
  • బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ పార్ట్ 2
  • బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - ఎల్ మల్ (ఎమిలియో పెరెజ్)
  • బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - ది బ్రూటలిస్ట్ (డానియెల్ బ్లూంబర్గ్)
  • బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ - ఐయామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్)
  • బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‍ప్లే - కాన్‍క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
  • బెస్ట్ మేకప్, హెయిర్‌స్టైల్ - ది సబ్‍స్టాన్స్
  • బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - విక్డ్ (పౌల్ టెజ్‍వెల్)
  • యానిమేటెడ్ ఫీచర్ మూవీ - ఫ్లో
  • బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ - ఐయామ్ నా ఎ రోబోట్
  • బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ - ఇన్ ది షాడోస్ ఆఫ్ ది సైప్రెస్
  • బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నో అదర్ ల్యాండ్

అనూజకు నిరాశ

బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్‍కు చెందిన అనూజ.. ఆస్కార్ 2025 అవార్డులకు నామినేట్ అయింది. అయితే, ఈ విభాగంలో ఐ నాట్ ఏ రోబోట్ చిత్రం అవార్డు కైవసం చేసుకుంది. దీంతో అనూజకు నిరాశ ఎదురైంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం