Oscars 2024 Live: మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుక.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?: వివరాలివే
Oscars 2024 Live: ఆస్కార్ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమవుతోంది. మరికొన్ని గంటల్లో ఈ అవార్డుల ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‍ను ఇండియాలో ఏ సమయానికి.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
Oscars Awards 2024 Live: అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఏడాది అకాడమీ (ఆస్కార్) అవార్డుల వేడుక మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరగనుంది. జిమ్మి కిమేల్ అకాడమీ వేడుకకు నాలుగోసారి ఈ ఆస్కార్ వేడుకకు హోస్ట్ చేయనున్నారు. ఈ అవార్డుల పండుగ కోసం సినీ ప్రేమికులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ 2024 అవార్డుల ఈవెంట్‍ను ఇండియాలో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..
టైమ్, స్ట్రీమింగ్ వివరాలివే
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో ఆస్కార్ 2024 అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరగనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 11వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఇండియాలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ అవార్డు వేడుక లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
వ్యాఖ్యతగా ఆయనే..
అమెరికన్ టెలివిజన్ హోస్ట్, కమెడియన్ జిమ్మీ కిమ్మెల్.. ఆస్కార్ 2024 అవార్డుల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అకాడమీ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన హోస్ట్‌గా చేయడం నాలుగోసారి కానుంది. ఈ వేడుకల్లో ఆయన వేసే జోక్‍ల కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన పాటలను కొన్ని బిల్లీ ఎలిష్, ర్యాన్ గోస్లింగ్ ఆలపించనున్నారు.
టాప్ నామినేటెడ్ సినిమాలు
దిగ్గజ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ఓపెన్‍హైమర్ చిత్రం ఏకంగా 13 విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, ఎస్‍ఏజీల్లో చాలా అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం.. ఆస్కార్‌ల్లోనూ చాలా పురస్కారాలను దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఓపెన్‍హైమర్ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన కిలియన్ మర్ఫీ తొలిసారి ఆస్కార్ గెలిచే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. బార్బీ, పూర్ థింగ్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రాలు కూడా కొన్ని విభాగాల్లో ఆస్కార్ 2024కు నామినేట్ అయ్యాయి.
ఆస్కార్ 2024లో కొన్ని ముఖ్యమైన విభాగాల నామినేషన్లు
ఉత్తమ చిత్రం విభాగం
- ఓపెన్‍హైమర్
- బార్బీ
- కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
- అమెరికన్ ఫిక్షన్
- అనాటమీ అఫ్ ఎ ఫాల్
- ది హోల్డోవర్స్
- మాస్ట్రో
- పాస్ట్ లైవ్స్
- పూర్ థింగ్స్
- ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ డైరెక్టర్ విభాగం నామినేషన్లు
- జస్టిన్ ట్రైట్ - అనాటమీ ఆఫ్ ఫాల్
- ఓపెన్‍హైమర్ - క్రిస్టఫర్ నోలాన్
- మార్చిన్ స్కార్సెస్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
- యోర్గోస్ లాంథిమోస్ - పూర్ థింగ్స్
- జొనాథన్ గ్లేజర్ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ లీడింగ్ నటుడు నామినేషన్లు
- కిలియన్ మర్ఫీ - ఓపెన్‍హైమర్
- బ్రాడ్లీ కూపర్ - మాస్ట్రో
- రస్టిన్ - కోల్మన్ డోమినిగో
- పౌల్ జియామటీ - ది హోల్డోవర్స్
- జెఫెరీ రైట్ - అమెరికన్ ఫిక్షన్
మరిన్ని విభాగాలు..
బెస్ట్ యాక్టర్ ఇన్ ఫీమేల్ లీడింగ్ రోల్, సపోర్టింగ్ రోల్‍లో ఉత్తమ నటుడు, సపోర్టింగ్ రోల్‍లో ఉత్తమ నటి, బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ సహా మరిన్ని విభాగాలు ఆస్కార్ 2024లో ఉన్నాయి.
ఈ ఏడాది ఆస్కార్ బరిలో భారతీయ చిత్రాలు లేవు. గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించి చరిత్ర సృష్టించింది. ఇండియాకు చెందిన ‘ఎలిఫెంట్ విస్పర్స్’కు బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు దక్కింది.
టాపిక్