Oscars 2023 when and where to watch: ఆస్కార్స్ 2023 లైవ్ ఎప్పుడు ఎక్కడ చూడాలి?-oscars 2023 when and where to watch the 95th academy awards ceremony ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Oscars 2023 When And Where To Watch The 95th Academy Awards Ceremony

Oscars 2023 when and where to watch: ఆస్కార్స్ 2023 లైవ్ ఎప్పుడు ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu
Mar 10, 2023 04:14 PM IST

Oscars 2023 when and where to watch: ఆస్కార్స్ 2023 లైవ్ ఎప్పుడు ఎక్కడ చూడాలి? 95వ అకాడెమీ అవార్డుల వేడుకకు టైమ్ దగ్గర పడుతోంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఈసారి మన ఆర్ఆర్ఆర్ కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

ఆస్కార్స్ కోసం సిద్ధమవుతున్న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్
ఆస్కార్స్ కోసం సిద్ధమవుతున్న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ (AP)

Oscars 2023 when and where to watch: ఆస్కార్స్.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు. తమ సినీ కెరీర్లలో కనీసం ఒక్కసారైనా ఈ అవార్డు అందుకోవాలని తహతహలాడని స్టార్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు 2023లో మరోసారి అకాడెమీ అవార్డుల వేడుకకు సమయం దగ్గర పడింది.

ఈసారి 95వ ఆస్కార్స్ వేడుక జరగబోతోంది. అయితే ఈసారి ఇండియన్స్ కు, ముఖ్యంగా తెలుగు వాళ్లకు ఈ అవార్డులపై ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. ఈ పాటకు అవార్డు రావడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఇదే వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

ఇదే కాకుండా ఈ అవార్డుల సెర్మనీలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తోంది. దీనికోసం ఆమె ఇప్పటికే అమెరికా వెళ్లింది. అటు ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా చాలా ముందుగానే అక్కడికి చేరుకుంది. రెడ్ కార్పెట్ పై మెరవడానికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తహతహలాడుతున్నారు.

ఆస్కార్స్ వేదిక ఎక్కడ?

ప్రతి ఏటా ఆస్కార్స్ వేడుక ఒకే చోట జరుగుతుంది. అది లాస్ ఏంజిల్స్ లోని హాలీవుడ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో. ఇదొక లైవ్ పర్ఫార్మెన్స్ ఆడిటోరియం. ఇది హాలీవుడ్ షాపింగ్ మాల్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ కాంప్లెక్స్ లో ఉంది.

ఆస్కార్స్ ఎప్పుడు చూడాలి?

ఆస్కార్స్ వేడుక ఆదివారం (మార్చి 12) రాత్రి జరగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 13) తెల్లవారుఝామున 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లైవ్ చూడొచ్చు. 2017, 2019లలో ఈ వేడుకను హోస్ట్ చేసిన జిమ్మీ కిమ్మెల్ ఈసారి ఆస్కార్స్ కు తిరిగి వచ్చాడు.

మొత్తం 23 కేటగిరీల్లో ఆస్కార్స్ ఇస్తారు. అందులో డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, కాస్ట్యూమ్, ఎడిటింగ్, మేకప్ లాంటివన్నీ ఉంటాయి. ఇక ఈసారి ఆస్కార్స్ వేదికపై మన నాటు నాటు పాటతోపాటు బ్లాక్‌పాంథర్: వకాండా ఫరెవర్ నుంచి లిఫ్ట్ మీ అప్ అనే సాంగ్ ను రిహానే పర్ఫార్మ్ చేయనుంది. టాప్ గన్: మావెరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్ అంటూ లేడీ గాగా కూడా అలరించనుంది. నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడతారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం