ఆస్కార్ నామినేటెడ్ యాక్షన్ మూవీ ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వాల్డ్ ఇన్ ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, చైనీస్, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజైంది.
హాంకాంగ్ నుంచి బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్‌కు ఈ మూవీ నామినేట్ అయ్యింది. కానీ తుది నామినేషన్స్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వాల్డ్ ఇన్ మూవీ హాంకాంగ్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సెకండ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వాల్డ్ ఇన్ మూవీకి సోయ్ చెనాంగ్ దర్శకత్వం వహించాడు. లూయిస్ కూ, సమ్మో హంగ్, రిచీ జెమ్, రేమండ్ లాంగ్ కీలక పాత్రల్లో నటించారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను మెప్పించాయి. వయలెన్స్‌ను పీక్స్‌లో సినిమాలో చూపించాడు డైరెక్టర్. సినిమాలోని ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా అనిపిస్తుంది.
చన్ లోక్ క్వాన్ ఓ శరణార్ధి. అనుకోకుండా వాల్డెన్ సిటీలోకి ఎంటర్ అవుతాడు. వాల్డెన్ సిటీ డ్రగ్స్, మాఫియాకు నిలయంగా ఉంటుంది. ఆ సిటీని మిస్టర్ బిగ్ డాన్‌గా ఉంటాడు. అనుకోకుండా మిస్టర్ బిగ్‌కు చెందిన కోట్ల రూపాయల డ్రగ్స్‌ను క్వాన్ కొట్టేస్తాడు. బిగ్ మనుషులకు క్వాన్ టార్గెట్‌గా మారుతాడు. అతడిని చంపేందుకు ప్రయత్నిస్తారు. బిగ్ మనుషుల బారి నుంచి క్వాన్ ఎలా తప్పించుకున్నాడు. ఈ కథలోని సైక్లోన్ అనే మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ఎలా వచ్చాడు అన్నదే ఈ మూవీ కథ.
ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వాల్డ్ ఇన్ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ అయ్యింది. పలు ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నది. హంకాంగ్ ఫిల్మ్ క్రిటిక్స్, 18 ఆసియా ఫిల్మ్ అవార్డ్స్‌తో పాటు పలు పురస్కారాలను దక్కించుకున్నది.
సంబంధిత కథనం