Oppenheimer Trailer: క్రిస్టఫర్ నోలాన్ మరో అద్భుతం.. ఓపెన్‌హైమర్ ట్రైలర్ రిలీజ్-oppenheimer trailer released as christopher nolan comes up with another gem ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Oppenheimer Trailer Released As Christopher Nolan Comes Up With Another Gem

Oppenheimer Trailer: క్రిస్టఫర్ నోలాన్ మరో అద్భుతం.. ఓపెన్‌హైమర్ ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu
May 08, 2023 07:27 PM IST

Oppenheimer Trailer: క్రిస్టఫర్ నోలాన్ నుంచి మరో అద్భుతం వస్తోంది. అతని లేటెస్ట్ మూవీ ఓపెన్‌హైమర్ ట్రైలర్ రిలీజ్ అయింది. సోమవారం (మే 8) మేకర్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఓపెన్‌హైమర్ మూవీలో సిలియన్ మర్ఫీ
ఓపెన్‌హైమర్ మూవీలో సిలియన్ మర్ఫీ

Oppenheimer Trailer: హాలీవుడ్‌లోనే కాదు ప్రపంచమంతా మెచ్చే డైరెక్టర్లలో ఒకడు క్రిస్టఫర్ నోలాన్. అతడు చేసిన ప్రతి మూవీ ఓ అద్భుతమే. తాజాగా అతడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా పేరు ఓపెన్‌హైమర్. ఈ మూవీ ట్రైలర్ ను సోమవారం (మే 8) రిలీజ్ చేశారు. అంచనాలకు తగినట్లే ఈ మూడు నిమిషాల ట్రైలర్ ఉంది.

హాలీవుడ్‌లోని మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన ఓపెన్‌హైమర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అమెరికన్ ఫిజిసిస్ట్, ప్రపంచంలోనే తొలి అణు బాంబును క్రియేట్ చేసిన రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మొదటి నుంచీ అన్నీ ఫిక్షనల్ స్టోరీలతోనే సినిమాలు చేసిన నోలాన్.. కొన్నేళ్ల కిందట డన్‌కిర్క్ మూవీతో తొలిసారి ఓ నిజ జీవిత కథను ఎంచుకున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాను కూడా రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశాడు. ట్రైలర్‌నే నోలాన్ ఎంతో ఉత్కంఠగా తీర్చిదిద్దాడు. ఈ మూవీలో రాబర్ట్ ఓపెన్‌హైమర్ రోల్ లో సిలియన్ మర్ఫీ నటించాడు. మాన్‌హాటన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆటం బాంబును క్రియేట్ చేసే మిషన్ ను అతడు లీడ్ చేస్తాడు. ఈ బాంబును రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వాడింది.

మ్యాట్ డామన్, ఎమిలీ బ్లంట్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ ప్యూ, రామి మాలెక్ లాంటి నటీనటులు ఈ ఓపెన్‌హైమర్ మూవీలో నటించారు. నోలాన్ మూవీస్ లో కనిపించే రిచ్‌నెస్ ఈ ట్రైలర్ లోనే తెలిసిపోయింది. రిచ్ విజువల్స్, మ్యూజిక్ కట్టిపడేస్తుంది. ఈ ఓపెన్‌హైమర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జులై 21న రిలీజ్ కాబోతోంది.

క్రిస్టఫర్ నోలాన్ నుంచి గతంలో ఇంటర్‌స్టెల్లార్, ఇన్సెప్షన్, ద ప్రిస్టిజ్, డార్క్ నైట్, టెనెట్ లాంటి సినిమాలు వచ్చాయి. చివరిసారి 2020లో టెనెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోలాన్.. మూడేళ్ల తర్వాత ఈ ఓపెన్‌హైమర్ తో మాయ చేయనున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్