OTT: ఆస్కార్ 2024 అవార్డులు గెలిచిన చిత్రాలను ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే.. ఓపెన్‍హైమర్ నుంచి పూర్ థింగ్స్ వరకు..-oppenheimer to poor things oscars 2024 award winning movies ott streaming platforms netflix amazon prime video hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఆస్కార్ 2024 అవార్డులు గెలిచిన చిత్రాలను ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే.. ఓపెన్‍హైమర్ నుంచి పూర్ థింగ్స్ వరకు..

OTT: ఆస్కార్ 2024 అవార్డులు గెలిచిన చిత్రాలను ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే.. ఓపెన్‍హైమర్ నుంచి పూర్ థింగ్స్ వరకు..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 11, 2024 07:27 PM IST

Oscars 2024 Awards Winning movies on OTT: ఆస్కార్స్ 2024ల్లో కొన్ని సినిమాలకు అవార్డుల పంట పండింది. ఓపెన్‍హైమర్, పూర్ థింగ్స్‌ సహా మరికొన్ని చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న చిత్రాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Oscar Winning movie on OTT: ఆస్కార్ 2024 అవార్డులు గెలిచిన చిత్రాలను ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..
Oscar Winning movie on OTT: ఆస్కార్ 2024 అవార్డులు గెలిచిన చిత్రాలను ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..

Oscars 2024 Movies on OTTs: ఆస్కార్ 2024 అవార్డుల కార్యక్రమంగా గ్రాండ్‍గా జరిగింది. సినీ ప్రపంచమంతా ఎదురుచూసిన ఈ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్‍ఏంజిల్స్‌లో నేడు కళ్లు చెదిరేలా జరిగింది. ఆస్కార్ 2024లో ఓపెన్‍హైమర్ ఏకంగా 7 అవార్డులతో టాప్‍లో నిలిస్తే.. పూర్ థింగ్స్ చిత్రానికి నాలుగు దక్కాయి. మరిన్ని సినిమాలు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకున్నాయి. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సినిమాలను ఇండియాలో ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో చూడొచ్చంటే..

ఓపెన్‍హైమర్

క్రిస్టఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ఓపెన్‍హైమర్ చిత్రానికి ఆస్కార్ 2024లో ఏకంగా ఏడు అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలాన్, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీకి ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ సినిమా పురస్కారంతో పాటు మరో నాలుగు అవార్డులు కూడా వచ్చాయి. ఓపెన్‍హైమర్ సినిమా ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉంది. మార్చి 21వ తేదీన ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.

పూర్ థింగ్స్

పూర్ థింగ్స్ సినిమాకు నాలుగు ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటి, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, మేకప్& హైయిర్ స్టైలింగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారాలు దక్కాయి. పూర్ థింగ్స్ సినిమా ప్రస్తుతం ‘డిస్నీ+ హాట్‍స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

బార్బీ

గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అయిన బార్బీ సినిమాకు ఆస్కార్ 2024ల్లో ఒక అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ చిత్రానికి ఎక్కువ విభాగాల్లో పురస్కారాలు వస్తాయని అంచనాలు వచ్చినా.. చివరికి ఒకే అవార్డుతో సరిపెట్టుకుంది. బార్బీ చిత్రం ప్రస్తుతం ‘జియోసినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

అమెరికన్ ఫిక్షన్

అమెరికన్ ఫిక్షన్ చిత్రానికి ఓ ఆస్కార్ అవార్డు వచ్చింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో పురస్కారం దక్కింది. ఈ చిత్రం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

  • బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకున్న ‘ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్’ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చు.
  • బెస్ట్ డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ 2024 అవార్డు దక్కించుకున్న ‘ది లాస్ట్ రిపైర్ షాప్’ మూవీ' డిస్నీ+ హాట్‍స్టార్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
  • బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ‘వార్ ఈజ్ ఓవర్!’ ‘యూట్యూబ్‍’లో అందుబాటులో ఉంది.

‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులు దక్కాయి. అయితే, ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. అనాటమీ ఆఫ్ ఫాల్, ది హోల్డోవర్స్, ది బాయ్ అండే ది హెరోన్, గాడ్జిల్లా: మైనస్ వన్, 20 డేస్ ఇన్ మారియిపోల్ చిత్రాలకు ఒక్కో ఆస్కార్ అవార్డు దక్కగా.. ఆ చిత్రాలు ఇంకా ఏ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రాలేదు.

ఓపెన్‍హైమర్ ఆస్కార్ ప్రభంజనం

అటామిక్ బాంబ్ సృష్టికర్తగా భావించే రాబర్ట్ ఓపెన్‍హైమర్ జీవితం ఆధారంగా ఓపెన్‍హైమర్ సినిమా రూపొందింది. స్టార్ డైరెక్టర్, మాస్టర్ మైండ్ క్రిస్టఫర్ నోలాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓపెన్‍హైమర్ పాత్రలో కిలియన్ మర్ఫీ నటించారు. ఈ సినిమాకు అనేక ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఆస్కార్ 2024లోనూ ఏడు అవార్డులతో ఓపెన్‍హైమర్ అదరగొట్టింది. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలాన్ తొలిసారి ఆస్కార్ అందుకున్నారు. ఉత్తమ నటుడిగా మర్ఫీకి పురస్కారం దక్కింది. బెస్ట్ సినిమా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లోనూ ఓపెన్‍హైమర్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు దక్కాయి.

Whats_app_banner