OTT Psycho Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్.. అలాంటి అమ్మాయిలే టార్గెట్.. ఎక్కడ చూడాలంటే?
Operation Raavan OTT Streaming Now: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ సైకో థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. రక్షిత్ అట్లూరి హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలైన ఆపరేషన్ రావణ్ మూడు నెలలకు ఓటీటీ రిలీజ్ అయింది.
Operation Raavan OTT Release: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక విభిన్న కంటెంట్ సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు సినీ ఆడియెన్స్. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, సైకలాజికల్ వంటి జోనర్స్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఆడియెన్స్ అభిరుచికి తగినట్లుగానే దర్శకనిర్మాతలు అలాంటి జోనర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
మీ ఆలోచనలే మీ శత్రువులు
అలా తెలుగులో వచ్చిన సైకో థ్రిల్లర్ మూవీనే ఆపరేషన్ రావణ్. ఏ సైకో స్టోరీ అంటూ రిలీజ్ అయిన ఆపరేషన్ రావణ్ చిత్రంలో రక్షిత్ అట్లూరి హీరోగా నటించాడు. సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా చేసింది. ఇక సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. "మీ ఆలోచనలే మీ శత్రువులు" అంటూ ఆపరేషన్ రావణ్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశారు.
న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా
ఆపరేషన్ రావణ్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ ట్రైలర్‌కు బాగానే రెస్పాన్స్ వచ్చింది. తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆపరేషన్ రావణ్ సినిమా ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో నిర్మించారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆపరేషన్ రావణ్ చిత్రాన్ని దర్శకుడు వెంకట సత్య డైరెక్ట్ చేశారు.
9.7 ఐఎమ్‌డీబీ రేటింగ్
ఆగస్ట్ 2న తెలుగు, తమిళ బాషల్లో ఆపరేషన్ రావణ్ విడుదలైంది. సినిమాకు బాగానే రెస్పాన్స్ వచ్చిన కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు. అంతేకాకుండా ఆపరేషన్ రావణ్ చిత్రానికి ఐఎమ్‌డీబీ నుంచి 9.7 రేటింగ్ ఉండటం విశేషం. అంతటి రేటింగ్ సొంతం చేసుకున్న ఆపరేషన్ రావణ్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
ఆపరేషన్ రావణ్ ఓటీటీ రిలీజ్
ఆపరేషన్ రావణ్ ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 2 నుంచి ఆహాలో ఆపరేషన్ రావణ్ ఓటీటీ రిలీజ్ అయింది. అంటే ఆగస్ట్ 2న థియేట్రికల్ రిలీజ్ అయిన ఆపరేషన్ రావణ్ సరిగ్గా మూడు నెలల తర్వాత నవంబర్ 2న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్ ఆపరేషన్ రావణ్ సినిమాను ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
ఆహా ఓటీటీలో రెస్పాన్స్
క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్‌ను ఆపరేషన్ రావణ్ బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఆహా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్‌తోపాటు చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు నటించారు.
మోసం చేసిన అమ్మాయిలే టార్గెట్
ఇదిలా ఉంటే, ఆపరేషన్ రావణ్ సినిమా కథ విషయానికొస్తే.. ప్రేమ పేరుతో మోసం చేసే యువతులను పెళ్లి చేసుకునే సమయంలో కిడ్నాప్ చేసి ఓ ముసుగు వ్యక్తి అతి కిరాతకంగా చంపుతుంటాడు. ఆ ముసుగు వ్యక్తి ఎవరు?, అతను ఎందుకు అమ్మాయిలను పెళ్లి రోజే చంపుతున్నాడు? అతనికి సహాయం చేస్తుంది ఎవరు? మరి ఆ ముసుగు వ్యక్తిని హీరో పట్టుకున్నాడా? అనేది ఆపరేషన్ రావణ్ కథ.
టాపిక్