OTT: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌కు అదిరిపోయే రెస్పాన్స్- 9.4 ఐఎమ్‌డీబీ రేటింగ్- రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్
Operation Raavan OTT Streaming Response: ఓటీటీలోకి ఇటీవల వచ్చిన తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఐఎమ్‌డీబీ నుంచి 9.4 రేటింగ్ అందుకున్న ఆపరేషన్ రావణ్ ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రెండు ఓటీటీల్లో ఆపరేషన్ రావణ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
Operation Raavan OTT Release: పలాస సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రక్షిత్ అట్లూరి నటించిన సైకో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధిక కీలక పాత్ర పోషించారు. అలాగే, రక్షిత్ అట్లూరికి జోడీగా హీరోయిన్ సంగీర్తన విపిన్ నటించింది.
తెలుగు, తమిళంలో
ఆపరేషన్ రావణ్ సినిమాను వెంకట సత్య దర్శకత్వం వహించారు. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి, రాధిక శరత్ కుమార్, సంగీర్తన విపిన్‌తోపాటు చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అయిన ఆపరేషన్ రావణ్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 9.4 రేటింగ్ (నవంబర్ 10 తేది నాటి ప్రకారం) రావడం విశేషం. అలాగే, ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నట్లు మేకర్స్ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. కానీ, కమర్షియల్ పరంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయినట్లు తెలుస్తోంది.
ఆహా ఓటీటీలో
ఇదిలా ఉంటే, సరిగ్గా మూడు నెలలకు అంటే, నవంబర్ 2 నుంచి ఆపరేషన్ రావణ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఆపరేషన్ రావణ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 2 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆపరేషన్ రావణ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు.
"ఆపరేషన్ రావణ్ సినిమాకు ఆహా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఆహాలో ట్రెండింగ్ అవుతోంది" అని మేకర్స్ తెలిపారు. అయితే, ఒక్క ఆహా ఓటీటీలోనే కాకుండా మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఆపరేషన్ రావణ్ ఓటీటీ రిలీజ్ అయింది.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ఓటీటీ
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ఓటీటీలో కూడా ఆపరేషన్ రావణ్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అంటే, రెండు ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే, ప్రేమిస్తున్నామని నమ్మించి మోసం చేసే అమ్మాయిలను వారి పెళ్లిరోజే హత్య చేసే ఓ సైకో కిల్లర్ స్టోరీగా ఆపరేషన్ రావణ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కాస్తా పురాణాల కాన్సెప్ట్ యాడ్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆపరేషన్ రావణ్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో "మా ఆపరేషన్ రావణ్ సినిమాకు మీరంతా ఇస్తున్న సపోర్ట్‌కు థ్యాంక్స్. సినిమా బాగుందనే టాక్ మార్నింగ్ షోస్ నుంచే మొదలైంది. ఆపరేషన్ రావణ్‌కు అన్ని చోట్ల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది" అని హీరో రక్షిత్ అట్లూరి తెలిపాడు.
సిల్వర్ కాయిన్
"నేను ఇప్పటిదాకా రూరల్ క్యారెక్టర్స్‌లో కనిపించాను. ఈ సినిమాలో అర్బన్ లుక్‌లో బాగున్నాననే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. నేను గతంలో చేసిన సినిమాలతో చూస్తే ఇందులో కొత్తగా ఉన్నానని చెబుతుండటం హ్యాపీగా ఉంది. మా కష్టానికి తగిన ఫలితంగా ప్రేక్షకులు విజయాన్ని అందించారు" అని రక్షిత్ అట్లూరి చెప్పాడు.
"మా మూవీలో సైకో ఎవరన్నది ఇంటర్వెల్‌లోగా గెస్ చేస్తే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్పాం. మీడియా నుంచి ఇద్దరు లేడీ రిపోర్టర్స్ కరెక్ట్‌గా గెస్ చేశారు. వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వడం సంతోషంగా ఉంది" అని ఆపరేషన్ రావణ్ హీరో రక్షిత్ అట్లూరి వెల్లడించాడు.
టాపిక్