OTT Web Series: ఓటీటీల్లో ఈ వారం మూడు వెబ్ సిరీస్‍లు.. ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‍లతో.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Web Series: ఈ వారం వెబ్ సిరీస్ చూడాలనుకుంటే.. మూడు ఇంట్రెస్టింగ్‍గా ఉండనున్నాయి. క్రైమ్ నుంచి కామెడీ డ్రామా వరకు డిఫరెంట్ జానర్లలో ఈ సిరీస్ ఉండనున్నాయి. ఈ వారం మూడు ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు ఏవంటే..

ఓటీటీల్లో ఈ వారం మూడు వెబ్ సిరీస్‍లు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీ పాయింట్లతో వస్తున్నాయి. ఇందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍గా ఉంది. ఊహించని ట్విస్టుతో గర్భం దాల్చే అమ్మాయి చుట్టూ ఓ కామెడీ డ్రామా సిరీస్ వస్తోంది. ఓ ప్రభుత్వ ఆఫీస్‍లో సాగే స్టోరీతో మరో సిరీస్ అడుగుపెట్టనుంది. ఇలా మూడు డిఫరెంట్ స్టోరీ లైన్‍లతో సిరీస్‍లు అడుగుపెడుతున్నాయి. ఈ వారం ఓటీటీల్లో మూడు టాప్ సిరీస్‍లు ఏవంటే..
ఊప్స్ అబ్ క్యా?
ఊప్స్ అబ్ క్యా? వెబ్ సిరీస్ ఈ గురువారం (ఫిబ్రవరి 20) జియోహాట్‍స్టార్ (డిస్నీప్లస్ హాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. శ్వేత బసు ప్రసాద్, ఆషిమ్ గులాటీ ఈ సిరీస్‍లో లీడ్ రోల్స్ పోషించారు. ఈ సిరీస్‍కు ప్రేమ్ మిస్త్రీ, దేవాత్మ మండల్ దర్శకత్వం వహించారు.
తన బాస్‍కు చెందిన స్పెర్మ్‌ను యాక్సిడెంటల్‍గా ఓ అమ్మాయిలోకి ప్రవేశపెట్టడం, ఆ తర్వాత ఏం జరిగిందనే స్టోరీలైన్‍తో ఊప్స్ అప్ క్యా సిరీస్ తెరకెక్కింది. శ్వేత బసు, ఆషిమ్‍తో పాటు జావేద్ జాఫరీ, సోనాలీ కులకర్ణి, అపర మెహతా, అభయ్ మహాజన్ కీలకపాత్రలు చేశారు. అమెరికన్ సిరీస్ జేన్ ది వర్జిన్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఊప్స్ అబ్ క్యా సిరీస్‍ను ఫిబ్రవరి 20 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు.
క్రైమ్ బీట్
క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ ఈ శుక్రవారం (ఫిబ్రవరి 21) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి నిజాలను వెలికితీసేందుకు, అతడిని పట్టుకునేందుకు ఓ క్రైమ్ జర్నలిస్టు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ ఉంటుంది. ఆ జర్నలిస్టుకు రకరకాల సవాళ్లు ఎదురవుతున్నా ముందుకు సాగుతాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో షకీబ్ సలీమ్, సబా ఆజాద్, రాహుల్ భట్ లీడ్ రోల్స్ చేశారు. సంజీవ్ కౌల్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‍ను కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూజ్ చేసింది. ఇటీవలే వచ్చిన క్రైమ్ బీట్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఆఫీస్
కామెడీ డ్రామా సిరీస్ ఆఫీస్.. ఫిబ్రవరి 21వ తేదీన జియో హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తమిళ కామెడీ డ్రామా సిరీస్‍కు జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో జరిగే కార్యకలాపాలతో ఈ సిరీస్ స్టోరీలైన్ ఉంటుంది. ఈ సిరీస్‍లో గురు లక్ష్మణ్ శబరీశ్ ప్రధాన పాత్ర పోషించారు. స్మేహ, కీర్తివేల్, కెమీ, తమిళవాణి, సరితిరన్, పరంథామన్ కీలకపాత్రలు చేశారు. ఆఫీస్ సిరీస్‍ను ఫిబ్రవరి 21 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో వీక్షించొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్