Om Bheem Bush 3 days box office collection: మూడు రోజుల్లోనే లాభాల్లోకి ఓం భీమ్ బుష్.. భారీగా వసూళ్లు
Om Bheem Bush 3 days box office collection: శ్రీవిష్ణు నటించిన కామెడీ మూవీ ఓం భీమ్ బుష్ మూడు రోజుల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
Om Bheem Bush 3 days box office collection: టాలీవుడ్‌లో గత శుక్రవారం (మార్చి 22) రిలీజైన కామెడీ మూవీ ఓం భీమ్ బుష్ మూవీ బాక్సాఫీస్ వసూళ్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సినిమాకు తొలి షో నుంచే మంచి టాక్ రావడంతో తొలి రెండు రోజుల కంటే మూడో రోజైన ఆదివారం (మార్చి 24) వసూళ్లు ఎక్కువగా రావడం విశేషం.
ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్
ఓం భీమ్ బుష్ మూవీ తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజుకంటే మూడో రోజు వసూళ్లు పెరిగినట్లు చెప్పారు. రూ.4.6 కోట్ల వసూళ్లతో ఈ సినిమా మొదలైంది. రెండో రోజు ఈ కలెక్షన్లు పెరిగి రూ.5.8 కోట్లకు చేరాయి. రెండు రోజుల్లో మొత్తంగా రూ.10.44 కోట్లు వచ్చాయి.
ఇక మూడో రోజైన ఆదివారం ఏకంగా రూ.6.56 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా మూడు రోజుల గ్రాస్ వసూళ్లు రూ.17 కోట్లుగా ఉన్నట్లు మేకర్స్ చెప్పారు. రూ.10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. అప్పుడే లాభాల బాట పట్టింది. సోమవారం (మార్చి 25) హోలీ హాలిడే ఉంది. దీనికి తోడు రాబోయే శుక్రవారం (మార్చి 29) కూడా గుడ్ ఫ్రైడే హాలిడే వస్తోంది.
దీంతో ఫస్ట్ వీక్ ముగిసేలోపు ఓం భీమ్ బుష్ మూవీ మంచి లాభాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణుతోపాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించారు. ఈ ముగ్గురి కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పడీపడీ నవ్వుతున్నారు.
ఓం భీమ్ బుష్ ఎలా ఉందంటే?
ఓం భీమ్ బుష్ సినిమా క్యాప్షన్ నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్. దానికితగినట్లుగానే సినిమా లాజిక్ లేకుండా బాగా నవ్వించి మ్యాజిక్ చేస్తుంది. సినిమా ఫస్టాఫ్ అంతా కాలేజీ సీన్లతో నవ్వులు పంచాయి.
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథే ఈ ఓం భీమ్ బుష్. అయితే కథ పరంగా కాకుండా కేవలం కామెడీ పరంగా చూస్తే సినిమా హిలేరియస్‌గా ఉంటుంది. నవ్వించడంలో మరోసారి బ్రోచెవారెవరురా కాంబోను రిపీట్ చేశారు.
ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్
ఓం భీమ్ బుష్ మూవీ డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా తమ ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు ఈ మధ్యే ఆ ఓటీటీ వెల్లడించింది.
ఆర్ యు రెడీ పేరుతో ప్రైమ్ వీడియో ఈ మధ్యే పెద్ద ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులోనే ఓం భీమ్ బుష్ మూవీ కూడా ఉంది. మూవీకి మంచి ఆదరణ లభిస్తుండటంతో నెల రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
టాపిక్