Oka Pathakam Prakaram Review: ఒక పథకం ప్రకారం రివ్యూ - లేటెస్ట్ తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Oka Pathakam Prakaram Review: సాయిరాం శంకర్ హీరోగా నటించిన ఒక పథకం ప్రకారం శుక్రవారం ఫిబ్రవరి 7న (నేడు) థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీతో సాయిరామ్ శంకర్‌కు హిట్టు దక్కిందా? లేదా? అంటే?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా కొంత గ్యాప్ తర్వాత ఒక పథకం ప్రకారం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి మలయాళ డైరెక్టర్ వినోద్ విజయన్ దర్శకత్వం వహించాడు. ఆషిమా నర్వాల్, శృతి సోథి, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించారు. శుక్రవారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
లాయర్ మర్డర్ కేసులో చిక్కుకుంటే…
సిద్ధార్థ్ నీలకంఠ (సాయిరామ్ శంకర్) ఓ లాయర్. చేపట్టిన ప్రతి కేసులో విజయం సాధిస్తుంటాడు. భార్య సీత (ఆషిమా నర్వాల్) మిస్సింగ్‌తో అతడి జీవితం మొత్తం తలక్రిందులవుతుంది. డ్రగ్ ఎడిక్ట్‌గా మారిపోతాడు. దివ్య (భాను) అనే అమ్మాయి హత్య కేసులో సిద్ధార్థ్‌ను హంతకుడిగా అనుమానిస్తాడు ఏసీపీ రఘురామ్ (సముద్రఖని). అతడిని అరెస్ట్ చేస్తాడు.
తనను తాను నిర్ధోషిగా నిరూపించుకొని మర్డర్ కేసు నుంచి బయటపడతాడు. దివ్య కేసులో సిద్ధార్థ్‌కు వ్యతిరేకంగా వాదించిన లాయర్ చినబాబు భార్య శృతి చనిపోతుంది. సిద్ధార్థ్ ఈ హత్య చేసినట్లు ఆధారాలు లభ్యమవుతాయి. రఘురామ్ స్థానంలో వచ్చిన ఏసీపీ కవిత (శృతి సోది) కూడా సిద్ధార్థే కిల్లర్ అని అనుమానిస్తుంది. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు?
సిద్ధార్థ్‌ను హంతకుడిగా నిరూపించాలని రఘురామ్, లాయర్ చినబాబు ఎందుకు ప్రయత్నించారు? అసలైన కిల్లర్‌ను సిద్ధార్థ్ ఎలా పట్టుకున్నాడు? సిద్ధార్థ్ భార్య సీత మిస్సింగ్‌కు కారణమేమిటి? అన్నదే ఒక పథకం ప్రకారం మూవీ కథ.
మలయాళ డైరెక్టర్స్ మాస్టర్స్...
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్‌ను తెరకెక్కించడంలో మలయాళ డైరెక్టర్స్ తర్వాతే ఎవరైనా. చిన్న కథలను పట్టుకొని చివరి వరకు బిగిసడలకుండా నరాలు తెగే ఉత్కంఠతో సినిమాలు చేయడంలో మలయాళ దర్శకులు ఆరితేరారు.
ఒక పథకం ప్రకారం మూవీని మలయాళం దర్శకుడే తెరకెక్కించడంలో తెలుగు ఆడియెన్స్ కూడా అలాంటి అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను వంద శాతం ఫుల్‌ఫిల్ చేయలేకపోయాడు డైరెక్టర్.
విలన్ ఎవరు?
ఒక పథకం ప్రకారం కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్స్ మాత్రం బాగా రాసుకున్నాడు డైరెక్టర్. వరుస హత్యలకు పాల్పడుతోన్న ఓ సీరియల్ కిల్లర్...అనుమానితుడిగా మారిన హీరో...అతడి వెంట పడుతోన్న పోలీసులు...ఈ అంశాల చుట్టే చివరి వరకు థ్రిల్లింగ్‌గా మూవీ సాగుతుంది. అసలు విలన్ ఎవరై ఉంటారు?
ఎందుకు హత్య చేస్తున్నారు అనే టెన్షన్‌ను బిల్డ్ చేశారు.ఆడియెన్స్ ఏ మాత్రం గెస్ చేయకుండా కొన్ని ట్విస్ట్‌లు ఉంటే...మరికొన్ని మాత్రం ఈజీగా తెలిసిపోతుంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో కిల్లర్ ఎవరన్నది రివీలైన తర్వాత వచ్చే సీన్స్‌ను ఇంకాస్త కొత్తగా రాసుకుంటే బాగుండేది. క్లైమాక్స్ ఫైట్ రొటీన్‌గానే ముగించిన భావన కలుగుతుంది.
ప్రశ్నలు...సమాధానాలు...
సిద్ధార్థ్ ప్రేమ కథ, సీత దూరమై అతడు పడే సంఘర్షణ చుట్టూ ఫస్ట్ హాఫ్ సాగుతుంది. సిద్ధార్థ్, ఏసీపీ రఘురామ్ ట్రాక్, కోర్టులో తనను తాను నిర్ధోషిగా సిద్ధార్థ్ నిరూపించుకునే సీన్స్‌లో డ్రామా బాగా పండింది. . ఎవరు...ఎందుకు అంటూ...ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రశ్నలతో నింపేశాడు డైరెక్టర్. కిల్లర్‌ను పట్టుకోవడానికి సిద్ధార్థ్ సాగించే అన్వేషణ...ఈ క్రమంలో ఒక్కో చిక్కుముడిని రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. ఛాప్టర్ వైజ్ డివైడ్ చేస్తూ కథను చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
డిఫరెంట్ వేరియేషన్స్...
లాయర్ పాత్రలో సాయిరామ్ శంకర్ నటన బాగుంది. క్యారెక్టర్‌కు తగ్గట్లుగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సముద్రఖని సీరియస్‌గా కనిపిస్తూనే కామెడీని పంచాడు. ఆషీమా నర్వాల్, శృతి సోధి నటన ఓకే. చాలా ఏళ్ల క్రితమే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న మూవీ ఇది. ఈ మూవీలో సీనియర్ నటుడు సుధాకర్ ఓ పాత్రలో కనిపించాడు.
బీజీఎమ్ బాగుంది...
ఒక పథకం ప్రకారం మూవీకి గోపీసుందర్, రాహుల్ రాజ్ మ్యూజిక్ అందించారు. బీజీఎమ్ కథలోని సస్పెన్స్‌ను ఎలివేట్ చేయడానికి ఉపయోగపడింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
క్రైమ్ థ్రిల్లర్ మూవీస్...
ఒక పథకం ప్రకారం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్ ఆకట్టుకుంటుంది. మెదడుకు పదును పెట్టే కథ, కథనాలు, ట్విస్ట్‌లు లేకపోయినా...కాన్సెప్ట్ మాత్రం బాగానే ఉంది. సాయిరాం శంకర్ చేసిన గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపిస్తుంది.
రేటింగ్: 2.5/5
సంబంధిత కథనం