Vinod Kumar Vijayan: చిన్న వయసులోనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చాను.. ఫహాద్ ఫాజిల్‌ను నేనే పరిచయం చేశాను.. డైరెక్టర్ కామెంట్స్-oka pathakam prakaram director vinod kumar vijayan about his debut in malayalam and says he introduced fahadh faasil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vinod Kumar Vijayan: చిన్న వయసులోనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చాను.. ఫహాద్ ఫాజిల్‌ను నేనే పరిచయం చేశాను.. డైరెక్టర్ కామెంట్స్

Vinod Kumar Vijayan: చిన్న వయసులోనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చాను.. ఫహాద్ ఫాజిల్‌ను నేనే పరిచయం చేశాను.. డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 04, 2025 10:35 AM IST

Director Vinod Kumar Vijayan About Fahadh Faasil Debut: పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌ను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశానని తెలిపారు దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్. సాయిరామ్ శంకర్ ఒక పథకం ప్రకారం ప్రమోషన్స్‌లో డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

చిన్న వయసులోనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చాను.. ఫహాద్ ఫాజిల్‌ను నేనే పరిచయం చేశాను.. డైరెక్టర్ కామెంట్స్
చిన్న వయసులోనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చాను.. ఫహాద్ ఫాజిల్‌ను నేనే పరిచయం చేశాను.. డైరెక్టర్ కామెంట్స్

Director Vinod Kumar Vijayan About Fahadh Faasil Debut: మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ "ఒక పథకం ప్రకారం". వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి దర్శక నిర్మాత వినోద్ కుమార్ విజయన్ తెరకెక్కింది ఈ చిత్రం.

ఫిబ్రవరి 7న ఒక పథకం ప్రకారం

వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఒక పథకం ప్రకారం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు.

మీ సినీ జర్నీ ఎలా ప్రారంభమైంది? మలయాళంలో మీరు చేసిన చిత్రాలేంటి?

-చాలా చిన్న వయసులో మాలీవుడ్‌ (మలయాళం)లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను అక్కడ ప్రొడక్షన్ చేశాను. చాలా చిత్రాలను నిర్మించాను. దర్శకత్వం వహించాను. నేను చేసిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఫహాద్ ఫాజిల్‌ను, గోపీ సుందర్ వంటి వారిని ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశాను. ఇప్పుడు మమ్ముట్టి సర్, ఫహాద్ ఫాజిల్‌లతో ప్రాజెక్టులు కూడా చేస్తున్నాను.

"ఒక పథకం ప్రకారం" సినిమా జర్నీ ఎలా ప్రారంభమైంది?

-చిన్నప్పుడు మా ఇంటి పక్కన తెలుగు వాళ్లుండే వారు. వారింట్లోనే నేను ఎక్కువగా ఉండేవాడిని. అలా నాకు తెలుగు అలవాటు అయింది. ఆ సమయంలో వారింట్లో నేను ఎన్టీఆర్ గారి సినిమాలు చూసేవాడిని. తెలుగులో నాకు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. పైగా నాకు సాయి రామ్ శంకర్ ఎప్పటి నుంచో తెలుసు. మేం ఇద్దరం చాలా మంచి స్నేహితులం. ఓ సారి ఈ కథ గురించి చెప్పాను. అలా ఈ జర్నీ ప్రారంభమైంది.

"ఒక పథకం ప్రకారం" చిత్రంలోని పాత్రలు ఎలా ఉంటాయి?

-ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఇది వరకు కనిపించనట్టుగా తెరపై కనిపిస్తారు. చాలా సెటిల్డ్‌గా నటించారు. శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని పాత్రలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. సెన్సార్ వాళ్లు కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు. చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేలా ఉంటుంది.

సాయిరామ్ శంకర్ సినిమాలు

ఇదిలా ఉంటే, చాలా కాలం గ్యాప్ తర్వాత సాయిరామ్ శంకర్ హీరోగా తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నాడు. పూరి జగన్నాథ్ సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిరామ్ శంకర్ 143, బంపర్ ఆఫర్, డేంజర్, వెయ్యి అబద్ధాలు వంటి ఇతర సినిమాలతో అలరించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం