OTT Crime Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులతో సాగే సినిమా.. తెలుగులో రిలీజైన వారానికే..-officer on duty ott release date malayalam crime action thriller on netflix kunchacko boban officer film streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులతో సాగే సినిమా.. తెలుగులో రిలీజైన వారానికే..

OTT Crime Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులతో సాగే సినిమా.. తెలుగులో రిలీజైన వారానికే..

Officer On Duty OTT Release Date: ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. తెలుగులో థియేటర్లలో రిలీజైన వారానికే ఈ మూవీ ఓటీటీలో అడుగుపెడుతోంది.

OTT Crime Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులతో సాగే సినిమా.. తెలుగులో రిలీజైన వారానికే..

మలయాళ నటుడు కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో కమర్షియల్‍గా మంచి కలెక్షన్లు దక్కాయి. మలయాళంలో ఈ చిత్రం ఫిబ్రవరి 20త తేదీన విడుదలై సక్సెస్ అయింది. ఈ చిత్రం తెలుగులో ఈ శుక్రవారమే (మార్చి 14) థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అప్పుడే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను ఖరారు చేసుకుంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐదు భాషల్లో..

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం మార్చి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (మార్చి 15) వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆఫీసర్ చిత్రం మార్చి 20న స్ట్రీమింగ్‍కు వస్తుందని నెట్‍ఫ్లిక్స్ ప్రకటించింది.

తెలుగులో విడుదలైన వారానికే..

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం తెలుగులో థియేటర్లలో రిలీజైన వారానికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ మార్చి 14న విడుదలైంది. ఈ మూవీకి తెలుగులోనూ మంచి టాక్ వచ్చింది. తెలుగులో రిలీజైన వారంలోగానే మార్చి 20న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీకి జితూ అష్రఫ్ దర్శకత్వం వహించారు. ఓ గోల్డ్ చైన్ దొంగతనం, ఓ అమ్మాయి చావు, ఓ పోలీసు ఆత్మహత్య చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ట్విస్టులతో ఈ మూవీని గ్రిప్పింగ్‍గా తెరకెక్కించారు అష్రఫ్. ఈ మూవీ మంచి టాక్ దక్కించుకుంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రంలో కుంచకో బోబన్‍తో పాటు ప్రియమణి, జగదీశ్, విశాఖ్ నాయర్, ఆడుకాలం నరేన్, విష్ణు వారియర్ కీరోల్స్ చేశారు. పోలీస్ ఆఫీసర్‌గా బోబన్ పర్ఫార్మెన్స్ ప్రశంసలు దక్కించుకుంది.

బాక్సాఫీస్ బ్లాక్‍బస్టర్

బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ సాధించింది ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ. ఈ చిత్రానికి సుమారు రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం సుమారు రూ.12కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. రూ.50కోట్ల వసూళ్లను దాటి సూపర్ హిట్‍గా ఈ మూవీ నిలిచింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో మలయాళంలో మంచి వసూళ్లను సొంతం చేసుకుంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ స్టోరీలైన్

సీఐ హరీశ్ శంకర్ (కుంచకో బోబన్) ఎప్పుడూ సిరీయస్‍గా ఉంటారు. తోటి ఉద్యోగులతోనూ దురుసుగా ఉండడం వల్ల సమస్యలను ఎదుర్కొంటాడు. సస్పెండ్ అయి మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో ఓ గోల్డ్ చైన్ దొంగతనం కేసును హరీశ్ శంకర్ చేపడతాడు. ఈ కేసులో ఓ అమ్మాయిని పోలీస్ స్టేషన్‍కు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అనుమానాస్పద రీతిలో మరణిస్తుంది. గతంలో ఓ పోలీసు ఆత్మహత్యకు, ఈ అమ్మాయి మృతికి, ఆ గోల్డ్ చైన్‍కు దొంగతనానికి లింక్ ఉందని హరీశ్ శంకర్ అనుమానిస్తాడు. దర్యాప్తు చేస్తుండగా చాలా పరిణామాలు జరుగుతాయి. మలుపులు ఎదురవుతాయి. అతడి వ్యక్తిగత విషయంతోనూ సంబంధం ఉంటుంది. ఈ కేసు దర్యాప్తు ఎలా సాగింది? ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? మిస్టరీని హరీశ్ శంకర్ ఛేదించాడా? అనేవి ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రంలో కీలక అంశాలుగా ఉంటాయి. ఈ మూవీ గ్రిప్పింగ్ నరేషన్, ఫ్యామిలీ ఎమోషన్లతో మెప్పిస్తుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం