ఓటీటీల్లో కొత్త సినిమాలు చూడాలనుకుంటున్నారా.. అయితే నేడు (మార్చి 21) మూడు ముఖ్యమైన చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. మలయాళంలో బ్లాక్‍బస్టర్ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం స్ట్రీమింగ్ కోసం చాలా మంది నిరీక్షించారు. ఈ మూవీ నేడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రహ్మా ఆనందంతో పాటు మరో తెలుగు చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేడు ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన టాప్-3 చిత్రాలు ఇవే..
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ నేడు (మార్చి 20) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అడుగుపెట్టింది. కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. రూ.12 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి బ్లాక్‍బస్టర్ సాధించింది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఫిబ్రవరి 20న మలయాళంలో థియేటర్ల విడుదలైంది. అదిరిపోయే కలెక్షన్లను సాధించింది. తెలుగులో మార్చి 14న రిలీజైంది. తెలుగులో రిలైజన వారానికే ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ మూవీకి జితూ అష్రఫ్ దర్శకత్వం వహించారు. పక్కా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇక ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.
బ్రహ్మా ఆనందం చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఒక రోజు ముందే గోల్డ్ యూజర్లకు ఈ చిత్రం అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ఆహా సబ్‍స్క్రైబర్లందరికీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ‘కామెడీ బ్రహ్మా’ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ కామెడీ డ్రామా చిత్రానికి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.
బ్రహ్మా ఆనందం చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తాతామనవళ్ల రిలేషన్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో వెన్నెల కిశోర్ కూడా ఓ కీరోల్ చేశారు. ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, ఐశ్వర్య కీలకపాత్రల్లో కనిపించారు. ఆహాలో ఈ వారం చూసేందుకు బ్రహ్మా ఆనందం ఓ మంచి ఆప్షన్‍గా ఉంటుంది.
జితేందర్ రెడ్డి సినిమా నేడు ఈటీవీ విన్ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రాకేశ్ వర్రే హీరోగా నటించిన ఈ చిత్రం నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించారు. జితేందర్ రెడ్డి చిత్రం గతేడాది నవంబర్ 8న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీలో రాకేశ్‍కు జోడీగా రియా సుమన్ నటించారు. వైశాలి, సుబ్బరాజు, రవిప్రకాశ్ కీలకపాత్రలు చేశారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం