Tamanna: దాంతోనే తమన్నా క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎండల్లో చెప్పులు లేకుండా నడిచారు.. ఓదెల 2 నిర్మాత కామెంట్స్-odela 2 movie producer d madhu comments on tamanna first look and shooting without slippers in summer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamanna: దాంతోనే తమన్నా క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎండల్లో చెప్పులు లేకుండా నడిచారు.. ఓదెల 2 నిర్మాత కామెంట్స్

Tamanna: దాంతోనే తమన్నా క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎండల్లో చెప్పులు లేకుండా నడిచారు.. ఓదెల 2 నిర్మాత కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Odela 2 Producer D Madhu About Tamanna: తమన్నా నటించిన లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో తెరకెక్కిన ఓదెల 2 నిర్మాత డి మధు మిల్కీ బ్యూటి తమన్నాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఒక్కదాంతో తమన్నా క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పారు.

దాంతోనే తమన్నా క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎండల్లో చెప్పులు లేకుండా నడిచారు.. ఓదెల 2 నిర్మాత కామెంట్స్

Odela 2 Producer D Madhu About Tamanna: మిల్కీ బ్యూటి తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 17న ఓదెల 2 థియేటర్స్‌లో విడుదల కానున్న సందర్భంగా నిర్మాత డి మధు సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

'ఓదెల 2' ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?

-ఓదెల ఫస్ట్ పార్ట్ నేను సంపత్ నంది గారికి తెలియకుండానే చూశాను. చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అనుకోకుండా సంపత్ నందిగారే ఓదెల2 కథని నాతో చెప్పడం జరిగింది. నాకు కంటెంట్ చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

మీరు సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి?

-నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పాషన్ ఉంది. కమర్షియల్‌గా కాకుండా సినిమాపై పాషన్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను.

సంపత్ నంది గారితో మీ కొలాబరేషన్ ఎలా ఉంది?

-సంపత్ నంది గారితో నాకు మంచి వేవ్ లెంత్ కుదిరింది. భవిష్యత్తులో ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది. ఒక మంచి ప్రాజెక్టు రావాలంటే ఒక మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి. అలాంటి అండర్ స్టాండింగ్ నాకు సంపత్ నంది గారికి మధ్య ఉంది.

తమన్నా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

- తమన్నా గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఫస్ట్ లుక్‌తోనే ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ కథ విషయంలో తమన్నా గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఏప్రిల్, మే ఎండల్లో చెప్పులు లేకుండా షూటింగ్ చేశారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ కథ ఆమె దగ్గరకు వెళ్లిందని నేను నమ్ముతున్నాను.

ప్రమోషనన్స్‌ని చాలా డిఫరెంట్ ప్లాన్ చేయడానికి కారణం?

-నాకు మొదటి నుంచి ఏదైనా వెరైటీగా చేయాలని ఉంటుంది. కాశీలో ఈ సినిమాని లాంచ్ చేశాం. అలాగే మహా కుంభమేళాలో టీజర్‌ని లాంచ్ చేశాం. చాలామంది అది రిస్క్‌తో కూడుకున్న వర్క్ ఏమో అనుకున్నారు. అయితే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే సక్సెస్ ఉంటుందని ఉంటుందని నా అభిప్రాయం. నేను సినిమాలపై పాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్టెడ్‌గా చేయాలనేదే నా ప్రయత్నం.

మీరు కథ వైపు నుంచి ఏవైనా సజెషన్స్ ఇస్తారా?

-కచ్చితంగా కథ గురించి మాట్లాడుకుంటాం. చాలా డిస్కషన్స్ జరుగుతాయి. అలాంటి డిస్కషన్ జరిగాయి కాబట్టే ఈ సినిమా అంతా గ్రాండ్‌గా వచ్చింది. తప్పకుండా నేను సెట్స్‌కి వెళ్తాను. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడ రాజీపడకుండా సినిమాని గ్రాండ్ స్కేల్‌లో నిర్మించడం జరిగింది.

సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయని మీరు నమ్ముతారా?

-నమ్మాము కాబట్టే సినిమా తీశాం ( నవ్వుతూ). ఈ సినిమా కథ లాజికల్‌గా ఉంటుంది. ప్రతి దానికి ఒక ఆధారంతోనే చూపించడం జరిగింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆడియన్స్‌ని చాలా సర్‌ప్రైజ్ చేస్తాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం