పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెద్దగా అంచనాలు లేని ఓ చిత్రం ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ తక్కువ బడ్జెట్ మూవీ స్ట్రీమింగ్‍లో సత్తాచాటుతోంది. అలాగే రెండు తెలుగు సినిమాలు కూడా టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. మరో తమిళ చిత్రం కూడా ట్రెండింగ్‍లో ఉంది. ఇలా అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్-5లో ప్రస్తుతం నాలుగు తెలుగు, తమిళ చిత్రాలు ఉన్నాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
తమిళ యాక్షన్ కామెడీ మూవీ 'గ్యాంగర్స్' ప్రస్తుతం (మే 24) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సినిమాల్లో నేషనల్ వైడ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీపై ఓటీటీలో ముందుగా పెద్దగా బజ్ నడవలేదు. కానీ స్ట్రీమింగ్‍కు వచ్చాక సత్తాచాటుతోంది. సుందర్ సీ దర్శకత్వం వహించిన ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా మే 15వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
థియేటర్లలో ఏప్రిల్ 24న గ్యాంగర్స్ మూవీ విడుదలైంది. సుందర్‌తో పాటు వడివేలు, క్యాథరిన్ థ్రెసా లీడ్ రోల్స్ చేశారు. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలో వచ్చిన ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో ప్రస్తుతం టాప్‍లో ఉంది. ట్రెండింగ్‍లో స్థానంలో ఏ వర్కింగ్ మ్యాన్ అనే ఇంగ్లిష్ మూవీ ఉంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలు అదరగొడుతున్నాయి. టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో మూడో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
ఓదెల 2 సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైంది. నెలలోగానే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం మంచి వ్యూస్‍తో దూసుకెళుతోంది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం మే 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నందమూరి కల్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ చిత్రం అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఓటీటీలో వచ్చాక మంచి వ్యూస్ సాధిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాల లిస్టులో నాలుగో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
'టెన్ హవర్స్' సినిమా ప్రైమ్ వీడియో సినిమాల విభాగంలో ప్రస్తుతం ఐదో స్థానంలో ట్రెండ్ అవుతోంది. సిబి సత్యరాజ్ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఈనెల మొదట్లో ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఇళయరాజా కలియపెరుమాల్ దర్శకత్వ వహించిన ఈ సినిమాకు ఆరంభం నుంచి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ లోబడ్జెట్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్డ్స్ టాక్ వచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ప్రైమ్ వీడియోలో మాత్రం బాగా పర్ఫార్మ్ చేస్తోంది. ఈ చిత్రాలు ట్రెండింగ్‍లో ఎంతకాలం జోరు కొనసాగిస్తాయో చూడాలి.
సంబంధిత కథనం