O Saathiya Movie Release: అరుదైన కాంబినేషన్‌లో ఓ సాథియా - వేసవిలో రిలీజ్
O Saathiya Movie Release: ఓ సినిమాకు దర్శకనిర్మాతలు ఇద్దరు మహిళలే ఉండటం అరుదుగా కనిపిస్తోంటుంది. అలాంటి అరుదైన కాంబినేషన్‌లో ఓ సాథియా సినిమా రూపొందుతోంది.
O Saathiya Movie Release: ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఓ సాథియా మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో దివ్య భావన దర్శకురాలిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పటివరకు తెలుగు తెరపై వచ్చిన లవ్ స్టోరీస్‌కు భిన్నంగా డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు దర్శకురాలు తెలిపింది. చందన కట్టా నిర్మిస్తోంది.
ఈ సినిమాకు దర్శకనిర్మాతలు ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. మహిళా దర్శకురాలు, నిర్మాత కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి సినిమాగా ఓ సాథియా నిలవనుంది. ఆర్యన్ గౌరకు హీరోగా ఇది రెండో సినిమా. గతంలో జీ జాంబీ పేరుతో ఓ సినిమా చేశాడు.
నితిన్ హీరోగా నటించిన చిన్నదానా నీకోసం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మిస్తీ చక్రవర్తి. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో ఆమె నటిస్తోన్న సినిమా ఇది. ఓ సాథియా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి.
వేసవిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
టాపిక్