O Manchi Ghost Review: ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ - వెన్నెల‌కిషోర్ హార‌ర్ కామెడీ మూవీ న‌వ్వించిందా? లేదా?-o manchi ghost review vennela kishore nandita swetha telugu horror comedy movie review omg review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  O Manchi Ghost Review: ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ - వెన్నెల‌కిషోర్ హార‌ర్ కామెడీ మూవీ న‌వ్వించిందా? లేదా?

O Manchi Ghost Review: ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ - వెన్నెల‌కిషోర్ హార‌ర్ కామెడీ మూవీ న‌వ్వించిందా? లేదా?

Nelki Naresh Kumar HT Telugu
Jun 21, 2024 03:29 PM IST

O Manchi Ghost Review: హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఓ మంచి ఘోస్ట్ (ఓఎమ్‌జీ) మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వెన్నెల కిషోర్‌, నందితా శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు శంక‌ర్ మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ
ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ

O Manchi Ghost Review: వెన్నెల‌కిషోర్‌, నందితా శ్వేత‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ ఓ మంచి ఘోస్ట్.(ఓఎమ్‌జీ) హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు శంక‌ర్ మార్తాండ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

పాడుబ‌డ్డ మ‌హ‌ల్ క‌థ‌...

ఎమ్మెల్యే స‌దాశివ‌రావు(నాగినీడు) పోస్ట‌ర్ మీద పేడ కొట్టాడ‌ని చైత‌న్య‌(ర‌జ‌త్ రాఘ‌వ‌)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైలులో ర‌జియా (న‌వ‌మి గాయ‌క్‌), ల‌క్ష్మ‌ణ్‌(న‌వీన్ నేని)తో పాటు పావురం (ష‌క‌లక శంక‌ర్‌)ల‌తో చైత‌న్య‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది.

ఈ న‌లుగురు క‌లిసి ఎమ్మెల్యే స‌దాశివ‌రావు కూతురు కీర్తిని (నందితా శ్వేత‌) కిడ్నాప్ చేస్తారు. ఊరి చివ‌ర ఉన్న పాడుబ‌డ్డ మ‌హాల్‌లో కీర్తిని దాచిపెట్టి ఎమ్మెల్యేను డ‌బ్బుల కోసం డిమాండ్ చేయాల‌ని అనుకుంటారు.

పాడుబ‌డ్డ మ‌హ‌ల్‌లో అడుగుపెట్టిన చైత‌న్య‌, ర‌జియా, ల‌క్ష్మ‌ణ్‌తో పాటు పావురం ప్రాణాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయి, అందులోని ద‌య్యం న‌లుగురిని చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. అందుకు కార‌ణం ఏమిటి?

ఆ ద‌య్యం బారి నుంచి న‌లుగురు త‌ప్పించుకున్నారా? మేన‌మామ అయిన స‌దాశివ‌రావుపై చైత‌న్య ఎందుకు ప‌గ‌ను పెంచుకున్నాడు? కీర్తి వింత‌వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ మ‌హ‌ల్‌లోనే న‌లుగురు స్నేహితుల‌కు కంట‌ప‌డిన ఆత్మ (వెన్నెల‌కిషోర్‌) మ‌నిషా? ద‌య్య‌మా? బ్రిటీష్ కాలం నాటి ఆ మ‌హ‌ల్ చ‌రిత్ర ఏమిటి? ఓ మంచి ద‌య్యం మూవీ(O Manchi Ghost Review) క‌థ‌.

ప్రేమ‌క‌థా చిత్రం నుంచి...

హార‌ర్ కామెడీ తెలుగులో స‌క్సెస్‌ఫుల్ జాన‌ర్‌గా ముద్ర‌ప‌డింది. ప్రేమ‌క‌థా చిత్రం, ఆనందోబ్ర‌హ్మ‌, గీతాంజ‌లితో పాటు హార‌ర్ కామెడీ క‌థాంశాల‌తో తెలుగులో వ‌చ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

చాలా వ‌ర‌కు హార‌ర్ కామెడీ జాన‌ర్‌లో సినిమాల్లో క‌మెడియ‌న్లే స్టార్లు. వారు ఎంత‌గా న‌వ్విస్తే సినిమా అంత హిట్టు. న‌వ్వుల‌తో పాటు భ‌యం కూడా అదే మోతాదులో ఉండేలా క‌థ రాసుకుంటే సినిమాకు కాసుల వ‌ర్షం కురిసిన‌ట్లే.ఈ ఫార్ములాను ప‌ట్టుకొని ఎంతో మంది ద‌ర్శ‌కులు స‌క్సెస్‌ల‌ను అందుకున్నారు. ఈ జోన‌ర్‌లో వ‌చ్చిన మ‌రో మూవీనే ఓ మంచి ఘోస్ట్‌O Manchi Ghost Review).

న‌వ్వుల‌తో మ్యాజిక్...

ఓ మంచి ఘోస్ట్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి. పాడుబ‌డ్డ మ‌హ‌ల్‌లోకి ప్ర‌ధాన పాత్ర‌లు అడుగుపెట్ట‌డం, అందులోని ద‌య్యం వారిని చంపాల‌ని ప్ర‌య‌త్నించ‌డం..

ఆ ద‌య్య బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి వారు ఎలాంటి ఎత్తులు వేశార‌న్న‌దే ఈ ఓ మంచి ఘోస్ట్ మూవీ క‌థ‌. ఈ కాన్సెప్ట్ సీరియ‌స్‌గా కాకుండా కంప్లీంట్‌గా కామెడీతోనే చెప్పాల‌ని ద‌ర్శ‌కుడు ఫిక్స‌య్యారు. లాజిక్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి న‌వ్వుల‌తో మ్యాజిక్ చేసి పాస్ మార్కులు కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించాడు.

క‌న్ఫ్యూజ‌న్ కామెడీ...

చైత‌న్య‌తో పాటు మిగిలిన ముగ్గురు డ‌బ్బుల కోసం ఇబ్బందులు ప‌డ‌టం, అడ్డుదారుల్లో ప్ర‌య‌త్నించి జైలు పాల‌య్యే సీన్స్‌తో స‌ర‌దాగా సినిమా మొద‌ల‌వుతుంది. డ‌బ్బు కోసం కీర్తిని కిడ్నాప్ చేయ‌డం, ఆమెతో క‌లిసి మ‌హ‌ల్‌లో అడుగుపెట్ట‌డం వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ కామెడీతో ఓ మంచి ఘోస్ట్‌ టైమ్‌పాస్ చేస్తుంది. ఆ సీన్స్ మొత్తం ఫ‌న్ వేలోనే రాసుకున్నారు డైరెక్ట‌ర్‌. ఇంట‌ర్వెల్‌లో కీర్తి క్యారెక్ట‌ర్ నేప‌థ్యంలో వ‌చ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క‌లిగించారు.

ఫ్లాష్‌బ్యాక్ కామ‌న్‌...

మ‌హ‌ల్‌లోని ద‌య్యం బారి నుంచి న‌లుగురు త‌ప్పించుకోవ‌డానికి వేసే ఎత్తులు, వాటి నుంచి పండే కామెడీతో సెకండాఫ్ లో న‌వ్విస్తూనే భ‌య‌పెట్టించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు వెన్నెల‌కిషోర్‌ను ద‌య్యం అనుకొని మిగిలిన వారు భ‌య‌ప‌డే సీన్స్ లోని ఫ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యింది. .

హార‌ర్ కామెడీ సినిమాల్లో ద‌య్యానికి ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉండ‌టం కామ‌న్‌. ఈ సినిమాలోనూ O Manchi Ghost Review)అదే ట్రిక్ ఫాలో అయ్యాడు డైరెక్ట‌ర్‌. బ్రిటీష్ కాలం నాటికి తీసుకెళ్లారు. ఆంగ్లేయుల చేతిలో అన్యాయానికి గురైన ఓ అమ్మాయి క‌థ‌ను చూపించారు. అయితే ఈ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లోని ఎమోష‌న్స్ అనుకున్న స్థాయిలో పండ‌లేదు. పెద్ద‌గా మ‌లుపులు లేకుండా సింపుల్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.

కామెడీ టెంపో మిస్‌...

క‌థ‌గా చూసుకుంటే ఓ మంచి ఘోస్ట్‌లో కొత్త‌ద‌నం లేదు. కామెడీ లోని టెంపో కొన్ని చోట్ల మిస్స‌యింది. వెన్నెల కిషోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్ స్థాయిలో మిగిలిన క్యారెక్ట‌ర్స్‌ను రాసుకుంటే బాగుండేది.

అంద‌రూ హీరోలే...

ఓ మంచి ఘోస్ట్‌లోప్ర‌త్యేకంగా హీరోలు అంటూ ఎవ‌రూ లేరు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు స‌మానంగా ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు ఈమూవీని తెర‌కెక్కించాడు. ఆత్మ పాత్ర‌లో వెన్నెల‌కిషోర్ క‌నిపించే సీన్స్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. త‌న కామెడీ టైమింగ్‌, పంచ్ డైలాగ్స్‌తో మెప్పించాడు వెన్నెల‌కిషోర్‌. పావురం పాత్ర‌లో ష‌క‌ల‌క శంక‌ర్ డైలాగ్ మాడ్యులేష‌న్‌, హ‌డావిడి ఫ‌న్నీగా అనిపిస్తుంది.

ద‌య్యంగా నందితా శ్వేత‌కు ఇలాంటి పాత్ర‌లు కొత్తేం కాదు. చాలా సినిమాల్లో చేసిన రోల్ కావ‌డంతోనే ఈజీగా క్యారెక్ట‌ర్‌ను ఓన్ చేసుకుంది. న‌వ‌మి గాయ‌క్ గ్లామ‌ర్‌తో మెప్పించింది. ర‌ఘుబాబు, న‌వీన్ నేని, ర‌జ‌త్ రాఘ‌వ్ కామెడీ కూడా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. అనూప్ రూబెన్స్ బీజీఎమ్ ఈ సినిమాకు బ‌లంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే కొన్ని చోట్ట భ‌య‌పెట్టాడు.

రెండు గంట‌లు టైమ్‌పాస్‌...

ఓ మంచి ఘోస్ట్ రెండు గంట‌లు టైమ్‌పాస్ చేసే హార‌ర్ కామెడీ మూవీ. వెన్నెల‌కిషోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ కోసం ఈ మూవీని ఓసారి చూడొచ్చు.

రేటింగ్‌: 2.75/5

WhatsApp channel