Star Maa Serials: నువ్వునేను ప్రేమ సీరియ‌ల్ టెలికాస్ట్‌ టైమ్‌ ఛేంజ్ - మామ‌గారు కూడా - కొత్త టైమింగ్స్ ఇవే...-nuvvu nenu prema and mamagaru serials timings changed by star maa disney plus hotstar serials ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials: నువ్వునేను ప్రేమ సీరియ‌ల్ టెలికాస్ట్‌ టైమ్‌ ఛేంజ్ - మామ‌గారు కూడా - కొత్త టైమింగ్స్ ఇవే...

Star Maa Serials: నువ్వునేను ప్రేమ సీరియ‌ల్ టెలికాస్ట్‌ టైమ్‌ ఛేంజ్ - మామ‌గారు కూడా - కొత్త టైమింగ్స్ ఇవే...

Star Maa Serials: నువ్వు నేను ప్రేమ‌తో పాటు మామ‌గారుసీరియ‌ల్స్ టైమింగ్స్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. రాత్రి ఏడు గంట‌ల‌కు టెలికాస్ట్ కావాల్సిన నువ్వు నేను ప్రేమ సీరియ‌ల్ ఇక నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ప్ర‌సార‌మ‌వుతుంద‌ని తెలిపింది.

నువ్వు నేను ప్రేమ‌, మామ‌గారు సీరియ‌ల్స్

Star Maa Serials: నువ్వు నేను ప్రేమతో పాటు మామ‌గారు సీరియ‌ల్స్ టైమింగ్స్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. నువ్వు నేను ప్రేమ సీరియ‌ల్ ఇదివ‌ర‌కు రాత్రి ఏడు గంట‌ల నుంచి ఏడున్న‌ర వ‌ర‌కు టెలికాస్ట్ అయ్యేది.

ఈ సీరియ‌ల్ రాత్రి నుంచి మ‌ధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారు. మ‌ధ్యాహ్నం 1 నుంచి 1.30 వ‌ర‌కు ఈ సీరియ‌ల్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని స్టార్ మా తెలిపింది. నువ్వు నేను ప్రేమ స్థానంలో రాత్రి ఏడు గంట‌ల‌కు కొత్త సీరియ‌ల్ చిన్ని టెలికాస్ట్ అవుతోంది. చిన్ని సీరియ‌ల్ కోసం నువ్వు నేను ప్రేమ సీరియ‌ల్ టైమ్‌ను మార్చారు.

ఇది మూడోసారి...

నువ్వు నేను ప్రేమ సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ చేయ‌డం ఇది మూడోసారి. ఈ సీరియ‌ల్ ప్రారంభ‌మైన కొత్త‌లో మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు టెలికాస్ట్ అయ్యేది. సీరియ‌ల్‌కు టీఆర్‌పీ రేటింగ్స్ బాగుండ‌టం, ఫాలోయింగ్ పెర‌గ‌డంతో రాత్రి ఏడు గంట‌ల‌కు సీరియ‌ల్ టైమ్‌ను ఛేంజ్ చేశారు.

ఇప్పుడు మ‌ళ్లీ ఆఫ్ట‌ర్‌నూన్‌కే ఈ సీరియ‌ల్‌ను తీసుకొచ్చారు. టీఆర్‌పీ రేటింగ్ బాగున్న సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ చేయ‌డం ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతోన్నారు. రాత్రి ఏడు గంట‌ల‌కే ఈ సీరియ‌ల్‌ను టెలికాస్ట్ చేస్తే బాగుంటుంద‌ని చెబుతోన్నారు.

విక్ర‌మాదిత్య‌, ప‌ద్మావ‌తి ప్రేమ‌క‌థ‌...

ప్ర‌స్తుతం స్టార్‌మాలో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా నువ్వు నేను ప్రేమ నిలిచింది. విక్ర‌మాదిత్య అలియాస్ విక్కీ డ‌బ్బుకు మాత్ర‌మే విలువ‌నిస్తుంటాడు. డ‌బ్బు కంటే అనుబంధాలు, అప్యాయ‌త‌లే ముఖ్య‌మ‌ని న‌మ్మే ప‌ద్మావ‌తి అనుకోకుండా విక్కీ జీవితంలోకి భార్య‌గా వ‌స్తుంది.

భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిసిన ఈ జంట కాపురం ఎలా సాగింది? భ‌ర్త కోసం ప‌ద్మావ‌తి ఎలాంటి త్యాగాలు చేసింది? ప‌ద్మావ‌తి ప్రేమ‌, మంచిత‌నాన్ని విక్కీ అర్థం చేసుకున్నాడా? లేదా? అనే క‌థాంశంతో నువ్వు నేను ప్రేమ సీరియ‌ల్ న‌డుస్తోంది. 2022లో ఈ సీరియ‌ల్ మొద‌లైంది. నువ్వు నేను ప్రేమ సీరియ‌ల్‌లో స్వామినాథ‌న్ అనంత‌రామ‌న్‌, ప‌విత్ర బీ నాయ‌క్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

మామ‌గారు సీరియ‌ల్ కూడా...

నువ్వు నేను ప్రేమ‌తో పాటు మామ‌గారు సీరియ‌ల్ టైమింగ్‌ను కూడా స్టార్ మా ఛేంజ్ చేసింది. ఇక నుంచి ఈ సీరియ‌ల్ మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు స్టార్‌మాలో టెలికాస్ట్ అవుతుంద‌ని ప్ర‌క‌టించింది. ఇంత‌కుముందు మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఈ సీరియ‌ల్ స్టార్ మాలో ప్ర‌సార‌మ‌య్యేది. ఈ సీరియ‌ల్ టైమ్‌ను నువ్వు నేను ప్రేమ‌కు ఇచ్చేశారు. మామ‌గారు సీరియ‌ల్‌లో సుహాసిని కీల‌క పాత్ర పోషిస్తోంది

బ్ర‌హ్మ‌ముడి టాప్‌...

ప్ర‌స్తుతం స్టార్ మా సీరియ‌ల్స్‌ టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా బ్ర‌హ్మ‌ముడి, కార్తీక దీపం 2 సీరియ‌ల్స్ టాప్‌లో ఉన్నాయి. వాటి త‌ర్వాత నువ్వు నేను ప్రేమ‌, గుండెనిండా గుడి గంట‌లుతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ కొన‌సాగుతోన్నాయి.