Tollywood: అత్యధిక భాషల్లో రీమేక్ అయిన ఇండియన్ మూవీ ఇదే - తెలుగు సినిమాదే ఆ రికార్డ్!
Nuvvostanante Nenoddantana: సిద్ధార్థ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ తొమ్మిది భాషల్లో రీమేకైంది. అత్యధిక భాషల్లో రీమేకైన ఇండియన్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది.
Nuvvostanante Nenoddantana: ఓ సూపర్ హిట్ మూవీ మహా అయితే రెండు, మూడు భాషల్లో రీమేక్ అవుతుంది. మరీ పెద్ద హిట్ అయితే ఐదు భాషల వరకు రీమేక్ అయ్యే అవకాశం ఉంది. కానీ తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లవ్‌స్టోరీ మూవీ ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యింది. ఆ సినిమా సిద్ధార్థ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా.
తొమ్మిది భాషల్లో రీమేక్...
ప్రభుదేవా దర్శకత్వంలో 2005లో రిలీజైన ఈ ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీ ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేకైంది. అత్యధిక భాషల్లో రీమేక్ అయిన ఇండియన్ మూవీగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డ్ నెలకొల్పింది. దృశ్యం, డాన్ సినిమాలు కూడా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి.
మోహన్‌లాల్ దృశ్యం మూవీ ఎనిమిది భాషల్లో రీమేక్ అయ్యింది. బాలీవుడ్ మూవీ డాన్ ఐదు భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ ప్రేమకథా చిత్రం రిలీజై 19 ఏళ్లు అవుతోన్న రీమేక్ మూవీస్ లిస్ట్‌లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డును బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌తో పాటు ఏ భాషకు చెందిన మూవీ బ్రేక్ చేయలేకపోయింది
హిందీలో...తమిళంలో...
నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ హిందీలో రామయ్య వస్తావయ్యా రీమేకైంది. ఈ బాలీవుడ్‌లో మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. హిందీ వెర్షన్‌కు ప్రభుదేవాను దర్శకత్వం వహించాడు. తమిళంలో ఉనక్కుం...ఎనక్కుం పేరుతో జయం రవి, త్రిష హీరోహీరోయిన్లుగా ఈ మూవీ రిలీజైంది. కన్నడం, బెంగాళీ, మణిపూరి, పంజాబీ, బంగ్లాదేశ్, నేపాలీ, ఓడియా భాషల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేకైంది. అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది.
ఐదు నంది అవార్డులు...
2005లో రిలీజైన నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఉత్తమనటి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో పాటు మొత్తం ఐదు విభాగాల్లో నంది అవార్డులను గెలుచుకున్నది. ఓ పేదింటి అమ్మాయితో ప్రేమలో పడిన గొప్పింటి యువకుడి కథతో ప్రభుదేవా ఈ మూవీని తెరకెక్కించాడు. తన ప్రేమ కోసం విలాసాలు వదిలి రైతుగా అతడు ఎందుకు మారాడు? ప్రియురాలి కోసం ఎలాంటి త్యాగం చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
త్రిష అన్నయ్యగా...
ఈ సినిమాలో త్రిష అన్నయ్యగా శ్రీహరి కనిపించాడు. సునీల్, అర్చన కీలక పాత్రలు పోషించారు. సినిమాలో దేవిశ్రీప్రసాద్ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా ఈ మూవీ నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ప్రభాస్ వర్షం మూవీలోని పాట ఆధారంగా ఈ సినిమాకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తెలుగులో సిద్ధార్థ్‌కు లవర్‌బాయ్‌గా ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో ప్రభుదేవా ఓ పాటలో నటించాడు. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజైంది.
టాపిక్