Horror Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్ మూవీ.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు.. ఎక్కడంటే..!
Horror Thriller OTT: ఛోరీ 2 చిత్రం ఓటీటీలో అదరగొడుతోంది. డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ భారీ వ్యూస్ సాధిస్తోంది. అప్పుడే నేషనల్ వైడ్‍గా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఛోరీ 2 చిత్రం హైప్ మధ్య వచ్చింది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఛోరీకి సీక్వెల్‍గా మంచి అంచనాలతో ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది. అందుకు తగ్గట్టే ఛోరీ 2 సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది.
ట్రెండింగ్‍లో టాప్
ఛోరీ 2 చిత్రం ఈ శుక్రవారం (ఏప్రిల్ 11) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి బజ్ ఉండటంతో ఆరంభం నుంచి ఈ చిత్రానికి భారీగా వ్యూస్ దక్కాయి. దీంతో ఇప్పుడే ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల ట్రెండింగ్ లిస్టులో ఛోరీ 2 టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ప్రస్తుతం (ఏప్రిల్ 13) ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
ఛోరీ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో హిందీలో ఒక్కటే అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషల డబ్బింగ్ ఆడియోలో వస్తుందో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. హిందీలో ఒక్కటే వచ్చినా ట్రెండింగ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే టాప్ ప్లేస్‍కు చేరుకుంది ఈ హారర్ థ్రిల్లర్ మూవీ. ఎన్నిరోజులు ట్రెండింగ్‍లో నిలుస్తుందో చూడాలి.
హారర్‌తో పాటు మెసేజ్
ఛోరీ 2 చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. పక్కా హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. హారర్‌తో పాటు బాలికలపై జరుగుతున్న సామాజిక దురాచారాల గురించి మెసేజ్ ఇచ్చారు. బాల్య వివాహాల అంశాన్ని చూపించారు. అతీత శక్తుల నుంచి తన కూతురిని రక్షించుకునేందుకు ఓ తల్లి చేసే ప్రయత్నాలతో ఈ మూవీ స్టోరీ ఉంటుంది.
ఛోరీ 2 చిత్రంలో సాక్షి పాత్రలో నుష్రత్ బరుచా నటించగా.. దాసీ మా అనే క్యారెక్టర్ చేశారు సోహా అలీ ఖాన్. బాలనటి హార్దిక శర్మ, గష్మీర్ మహాజానీ, సౌరభ్ గోయల్ కూడా కీలకపాత్రలు పోషించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ బాగా ఈ చిత్రానికి ప్లస్ అయింది. అక్కడక్కడా సీన్లు రిపీటెడ్ అనిపించడం మినహా ఈ మూవీ ఆకట్టుకుంటుంది. అయితే, హారర్ ఎలిమెంట్లు మరీ ఎక్కువ కాకుండా మోస్తరుగా ఉంటాయి. క్లైమాక్స్ కాస్త మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది.
ఛోరీ 2 సినిమాను టీ సిరీస్, అబుందాతియా ఎంటర్‌టైన్‍మెంట్, సైక్ ఫిల్స్మ్, తమరిస్క్ లైన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, జాక్ డేవిస్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి అద్రిజ గుప్తా సంగీతం అందించగా.. అన్షుల్ చోబే సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం