NTR Neel: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్‍కు డేట్ ఖరారు!-ntrneel update jr ntr and director prashanth neel movie to launch on august 9 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr Neel: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్‍కు డేట్ ఖరారు!

NTR Neel: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్‍కు డేట్ ఖరారు!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 06, 2024 02:24 PM IST

NTR Neel Update: జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‍లో సినిమా ప్రారంభానికి రెడీ అయింది. లాంచ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే.

NTR Neel: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్‍కు డేట్ ఖరారు!
NTR Neel: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్‍కు డేట్ ఖరారు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణ ముగియనుంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‍లో హృతిక్ రోషన్‍తో కలిసి వార్-2 చిత్రం కూడా చేస్తున్నారు ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ సినిమాల బ్లాక్‍బస్టర్లతో జోష్ మీద ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో ఎన్టీఆర్ సినిమా (NTR 31) చేయనున్నారు. ఈ మూవీ ప్రారంభానికి డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది.

డేట్ ఇదే

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుందని మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే ఈనెలలోనే ఈ చిత్రం షురూ కానుంది. ఇందుకు డేట్ కూడా ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. ఎన్టీఆర్‌, నీల్ మూవీ ఈవారమే ఆగస్టు 9వ తేదీన లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై రెండు రోజుల్లోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‍లో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై చాలా కాలంగా బజ్ నడుస్తుండగా.. ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఆగస్టులో మొదలవుతుందంటూ ఓ పోస్టర్ తీసుకొచ్చారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‍లో ఈ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగానే ఉండనుంది. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారనే రూమర్లు వచ్చాయి. ఈ ఎన్టీఆర్31 ప్రాజెక్టుపై ఇప్పటికే చాలా బజ్ ఉంది.

ఫుల్ స్వింగ్‍లో దేవర

దేవర షూటింగ్ పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‍లో సాగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ముగియనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ విలన్లు నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

దేవర సినిమా నుంచి రెండో పాట సోమవారం (ఆగస్టు 5) వచ్చింది. చుట్టమల్లే అంటూ ఉన్న ఈ మెలోడీ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ పాట రిలీజ్ అయింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఈ సాంగ్‍లో ఆకట్టుకుంది. స్టన్నింగ్ విజువల్స్‌తో లిరికల్ వీడియో అదిరిపోయింది. మెలోడీ ట్యూన్‍తో అనిరుధ్ మెప్పించారు. ఈ మూవీ ద్వారానే తెలుగులోకి అడుగుపెడుతున్నారు జాన్వీ కపూర్.

బాలీవుడ్‍లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్-2 చిత్రం చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో స్టార్ హీరో హృతిక్ రోషన్‍తో కలిసి నటిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీపై కూడా చాలా క్రేజ్ ఉంది. ఈ మూవీలో జాన్ అబ్రహాం కూడా క్యామియో రోల్‍లో కనిపిస్తారని తెలుస్తోంది.