Ntr Hosts Talk Show: బుల్లితెర‌పైకి రీఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్ - బాబాయ్‌కి పోటీగా కొత్త టాక్ షో-ntr return to small screen with new celebrity talk show streaming details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Return To Small Screen With New Celebrity Talk Show Streaming Details Here

Ntr Hosts Talk Show: బుల్లితెర‌పైకి రీఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్ - బాబాయ్‌కి పోటీగా కొత్త టాక్ షో

Nelki Naresh Kumar HT Telugu
May 08, 2023 03:17 PM IST

Ntr Hosts Talk Show: టాలీవుడ్ అగ్ర హీరో స్మాల్‌స్క్రీన్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఓ టాక్ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ షో ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే...

ఎన్టీఆర్
ఎన్టీఆర్

Ntr Hosts Talk Show: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పైకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ టాక్ షోకు హోస్ట్‌గా ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ వ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

త‌న‌దైన మాట‌ల గార‌డితో హోస్ట్‌గా అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు. ఆ త‌ర్వాత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో బుల్లితెర‌కు దూర‌మ‌య్యాడు.

తాజాగా ఆయ‌న స్మాల్‌స్క్రీన్‌పై మ‌ళ్లీ క‌నిపించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా స‌రికొత్త టాక్ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ షో ఈ టీవీతో పాటు ఈ టీవీ విన్ ఓటీటీ యాప్‌లోనూ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో వ‌చ్చిన సెల‌బ్రిటీ టాక్ షోల‌కు భిన్నంగా ఎన్టీఆర్ షోను డిజైన్ చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్ షో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ రియాలిటీ షోకు పోటీగానే ఎన్టీఆర్ టాక్ షో మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు మ‌రికొంద‌రు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ఈ షోపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

కొర‌టాల శివ మూవీ...

ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌ కొర‌టాల శివ‌తో యాక్ష‌న్ ఎంట‌ర్ మూవీ చేస్తోన్నాడు ఎన్టీఆర్‌. కోస్ట‌ల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో పూర్త‌యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. అలాగే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు ఎన్టీఆర్‌

WhatsApp channel

టాపిక్