Jr Ntr Fan Died: అభిమాని అనుమానాస్పద మృతిపై స్పందించిన ఎన్టీఆర్ - దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి
Jr Ntr Fan Died: తన వీరాభిమాని శ్యామ్ మరణంపై ఎన్టీఆర్ స్పందించాడు. శ్యామ్ మరణంపై తక్షణమే దర్యాప్తు జరపాలని ప్రభుత్వ అధికారులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశాడు.
Jr Ntr Fan Died: ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడటం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అభిమాని మరణంపై ఎన్టీఆర్ స్పందించారు. అభిమాని మృతికి సంతాపం వ్యక్తం చేశాడు ఎన్టీఆర్. శ్యామ్ మరణంపై తక్షణమే దర్యాప్తు జరపాలని ప్రభుత్వ అధికారులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ లేఖను రిలీజ్ చేశారు.
"శ్యామ్ మరణం అత్యంత బాధాకరణమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం నా మనసును కలిచివేస్తుంది" అని ఎన్టీఆర్ ఈ లెటర్‌లో పేర్కొన్నాడు. అభిమాని మరణంపై ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన శ్యామ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిది సూసైడ్ అంటూ పోలీసులు ప్రకటించారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ వర్గాలు మాత్రం శ్యామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. శ్యామ్ మరణం వెనుక వైస్ఆర్‌సీపీ ప్రమేయం ఉందంటూ ఆరోపించారు.
శ్యామ్ మరణానికి కారకులను శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా అభిమాని మరణంపై స్పందించడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
శ్యామ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మానాన్న నన్ను క్షమించండి. జాబ్ చేయాలనే ఆసక్తి లేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నాడు.