Ntr Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై బిగ్ అప్‌డేట్ - రిలీజ్ డేట్ ఇదే
Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 2026 జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మైత్రీ మూవీ మేకర్స్ గుడ్‌న్యూస్ వినిపించింది. ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ 2026 జనవరి 9న రిలీజ్ కాబోతున్నట్లు ఆఫీషియల్‌గా వెల్లడించింది. ఎన్టీఆర్, నీల్ అంటూ ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అతడి నాయకత్వంలో భూమి కంపిస్తుంది అంటూ పోస్టర్‌కు ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
శుక్రవారం ఓపెనింగ్ ఈవెంట్...
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సింపుల్‌గా ఈ వేడుకను జరిపారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో పాటు కళ్యాణ్‌రామ్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు పాల్గొన్నారు. ఈ లాంఛింగ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా హాజరైనట్లు సమాచారం.
31వ మూవీ...
ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 31వ సినిమా ఇది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ గత సినిమాలు కేజీఎఫ్, సలార్‌కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉంటుందని వార్తలు వినిపిస్తోన్నాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలిసింది.
దేవరతో బిజీ...
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ రెండుసార్లు మారింది. తొలుత ఏప్రిల్5న విడుదలచేయాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 10కి వాయిదావేశారు. సెప్టెంబర్ 27న రావాల్సిన ఓజీ వెనక్కి తగ్గడంతో ఆ డేట్‌కు దేవరను షిఫ్ట్ చేశారు.
రెండు భాగాలు..
దేవర మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. కళ్యాణ్ రామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ మూవీని సుధాకర్ మిక్కిలేని, హరి కోసరాజు ప్రొడ్యూస్ చేశారు. దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ కోసమే దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
మరోవైపు ప్రభాస్ సలార్‌తో గత ఏడాది ప్రేక్షకులను పలకరించాడు ప్రశాంత్ నీల్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. సలార్ సీక్వెల్‌ను చేయబోతున్నాడు ఎన్టీఆర్. అలాగే అజిత్‌తో ఓ మూవీకి అతడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
టాపిక్