Ntr Devara: దేవర నుంచి ఎన్టీఆర్ లుక్ లీక్ - సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఫొటో
Ntr Devara: దేవర మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ లీకైంది. ఈ లీక్‌డ్ ఫొటోలో ఎన్టీఆర్ మాస్ లుక్‌లో కనిపిస్తోన్నారు. ఈ లీక్‌డ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ntr Devara: లీకుల బెడద టాలీవుడ్ దర్శకనిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్టార్ హీరోల లుక్‌లు, ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లీకుల బారిన ఎన్టీఆర్ దేవర పడింది. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ లీకైంది.
సోషల్ మీడియాలోవైరల్...
ఈ లీక్‌డ్ ఫొటోలోఎన్టీఆర్ మాస్ లుక్‌లో కనిపిస్తోన్నారు. గడ్డం, మెలితిరిగిన కండలతో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంది. ఎన్టీఆర్ లీక్‌డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తోన్నారు. ఇంతకుముందు దేవర టీమ్ రిలీజ్ చేసిన ఆఫీషియల్ ఫొటోలతో పోలిస్తే ఇందులో ఎన్టీఆర్ డిఫరెంట్‌గా కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించే అవకాశం ఉందని, ఇది మరో పాత్రకు సంబంధించిన లుక్ కావచ్చునని అభిమానులు ట్వీట్లు చేస్తోన్నారు. మాస్ లుక్‌లో ఎన్టీఆర్ మామూలుగా లేడని అంటోన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో తీర ప్రాంత ప్రజల కోసం పోరాడే నాయకుడిగా పవర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
సెప్టెంబర్ 27న రిలీజ్...
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ఇది. దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
తొలుత ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడంతో అక్టోబర్ 10కి రిలీజ్‌ను వాయిదావేశారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ వాయిదాపడటంతో అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్‌కు దేవరను షిఫ్ట్ చేశారు.
ఇద్దరు విలన్లు...
దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ భారీ యాక్షన్ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తోన్నాడు. అతడితో పాటు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కూడా దేవరలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపిస్తాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.
ఫియర్ సాంగ్...
దేవర మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫియర్ సాంగ్‌కు యూట్యూబ్‌లో యాభై మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి.
దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కబోతున్నది. దేవర పార్ట్ 1ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది
ప్రజెంటర్‌గా కళ్యాణ్ రామ్...
దేవర మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.