Ntr Koratala Siva Movie Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - త్వరలో సెట్స్‌పైకి కొరటాల శివ సినిమా
Ntr Koratala Siva Movie Update: ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఆ అప్‌డేట్ ఏమిటంటే..
Ntr Koratala Siva Movie Update: ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమాను అనౌన్స్ చేసే రెండేళ్లు దాటిపోయింది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, ఆచార్యతో కొరటాల శివ బిజీగా ఉండటంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమైంది. ఆర్ఆర్ఆర్ రిలీజై దాదాపు ఏడు నెలలు గడిచినా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలుకాకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
కొరటాల శివ చెప్పిన కథ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ సినిమా స్థానంలో మరో ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ మొదలుపెట్టబోతున్నట్లు పుకార్లు షికారు చేశాయి.
అయితే అవన్నీ అవాస్తవాలేనని తేలింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలిపారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు.
తొలుత అలియాభట్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె సినిమాపై సంతకం చేయకుండానే తప్పకున్నది. అలియా స్థానంలో మరో హీరోయిన్ కోసం చాలా రోజులుగా చిత్ర బృందం అన్వేషిస్తోంది. త్వరలోనే హీరోయిన్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సుధాకర్ మిక్కిలినేనితో కలిసి హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 30వ సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత పాన్ ఇండియన్ స్థాయిలో ఎన్టీఆర్‌కు ఇమేజ్ ఏర్పడింది. ఈ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న ఎన్టీఆర్ 30 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.