Devara Daavudi Song Release: దేవర మూడో పాట ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ రిలీజ్ టైమ్ ఇదే.. ఫాస్ట్ బీట్‍తో ట్రెండీగా..-ntr janhvi kapoor devara third single daavudi promo out full video song date and time revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Daavudi Song Release: దేవర మూడో పాట ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ రిలీజ్ టైమ్ ఇదే.. ఫాస్ట్ బీట్‍తో ట్రెండీగా..

Devara Daavudi Song Release: దేవర మూడో పాట ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ రిలీజ్ టైమ్ ఇదే.. ఫాస్ట్ బీట్‍తో ట్రెండీగా..

Devara Third Single - Daavudi song Release: దేవర సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అలాగే, రేపు (సెప్టెంబర్ 4) ఏ సమయానికి ఫుల్ సాంగ్ వస్తుందో మూవీ టీమ్ వెల్లడించింది. ఫాస్ట్ బీట్‍తో ఈ పాట ఉండనుందని ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది.

Devara Daavudi Song Release: దేవర మూడో పాట ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ రిలీజ్ టైమ్ ఇదే.. ఫాస్ట్ బీట్‍తో ట్రెండీగా..

దేవర సినిమాపై నానాటికీ హైప్ పెరుగుతూనే ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఈ యాక్షన్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పాటలు ఫుల్ క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ అలరించగా.. మూడో పాట కూడా రెడీ అయింది. ఈ థర్డ్ సాంగ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఫుల్ సాంగ్ టైమ్ ఖరారైంది.

ప్రోమో ఇలా..

దేవర మూడో పాటకు సంబంధించిన ప్రోమో నేడు (సెప్టెంబర్ 3) నేడు వచ్చింది. ‘దావుది.. వదిరే’ అంటూ క్యాచీ పదాలతో ట్రెండీగా ఈ ప్రోమో ఉంది.15 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రోమోలో ట్యూన్ ఫాస్ట్ బీట్‍‍తో ఉంది. ఈ పాట మొత్తం ఫుల్ జోష్ ఉండే ట్యూన్‍తో పక్కా డ్యాన్స్ నంబర్‌గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య డ్యూయెట్‍గా ఈ సాంగ్ ఉండనుంది.

దేవర నుంచి ఈ ‘దావుది’ పాటను తెలుగులో నకాష్ అజీస్, అక్ష ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవించర్ ఈ పాటకు అదిరిపోయే బీట్ అందించారని అర్థమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సాంగ్ రానుంది. ఆయా భాషలకు సింగర్లు, లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు. ఈ ప్రోమోతో పాటు ఫుల్ సాంగ్ డేట్, టైమ్‍ను మూవీ టీమ్ రివీల్ చేసింది.

ఫుల్ వీడియో సాంగ్ డేట్, టైమ్

దేవర సినిమా నుంచి ఈ మూడో పాట రేపు (సెప్టెంబర్ 4) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు ప్రోమోతో పాటు వెల్లడించింది. డేట్ ఇప్పటికే రాగా.. టైమ్‍ను మాత్రం నేడు ఫిక్స్ చేసింది. లిరికల్ సాంగ్ అని కాకుండా.. వీడియో సాంగ్ అని మూవీ టీమ్ పేర్కొంది. అంటే పూర్తి డ్యాన్స్‌తో వీడియోను తీసుకొస్తుందేమో చూడాలి.

“డ్యాన్స్ చేయాలనిపించేలా ఉండే దావుది సాంగ్.. స్పీకర్లలో ఫుల్ సౌండ్ పెట్టేలా చేస్తుంది. రేపు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ అవుతుంది” అని దేవర టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పక్కా బ్లాక్‍బస్టర్ సాంగ్ గ్యారెంటీ అంటూ మరింత హైప్ పెంచేసింది.

దేవర నుంచి గత నెల వచ్చిన రొమాంటిక్ మెలోడీ సాంగ్ ‘చుట్టమల్లే’ చార్ట్ బస్టర్ అయింది. ఒక్క తెలుగులోనూ ఈ పాట లిరికల్ వీడియోకు యూట్యూబ్‍లో 100 మిలియన్ వ్యూస్ దాటేశాయి. మ్యూజిక్ ప్లాట్‍ఫామ్ ‘స్పాటిఫై’లోనూ ఈ చిత్రం గ్లోబల్ లిస్టులో ట్రెండ్ అయి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ కూడా మార్మోగుతోంది.

దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, జాన్వీ జోడీగా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. బాబి డియోల్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి.