తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆయన నటనా పాటవానికి యావత్ దేశమంతా పులకరించిబోతుంది. కోమురం భీముడిగా తారక్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో తననే డామినేట్ చేశాడని రామ్ చరణ్ సైతం అన్నాడంటే ఎన్టీఆర్ ప్రదర్శన ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఒక్క యాక్టింగ్‌లోనే కాదు డ్యాన్స్, ఆహార్యం ఎందులోనైనా తారక్ సమకాలీన నటులతో పోలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాడు. తెలుగు చిత్రసీమలో బాలనటుడిగా అరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. వచ్చి అప్పుడే 25 ఏళ్లు పూర్తయింది.,రామాయణం చిత్రంతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు తారక్. ఈ చిత్రం 1997 ఏప్రిల్‌లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మరపురాని చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. పూర్తిగా చిన్న పిల్లలతోనే ఈ సినిమాను రూపొందించి విజయాన్ని అందుకున్నారు గుణశేఖర్. ఇందులో దాదాపు 3 వేల మంది చిన్నారులను నటింపజేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సరవడమే కాకుండా.. నందమూరి తారక రామారావు మనవడైనందున రాముడి పాత్రను పోషించేందుకు ఎన్టీఆర్ పెద్దగా కష్టపడలేదు. 13 ఏళ్ల వయసులోనే శ్రీరాముడిగా కనిపించి తెలుగునాట సినీలోకాన్ని ఆశ్చార్యానికి గురి చేశారు.,ఫలితంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా రెండు నంది పూరస్కారాలు గెల్చుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శబ్దాలయా థియేటర్స్ పతాకంపై ఎంఎం రెడ్డి నిర్మించారు. ఎల్ వైద్యనాథన్ బ్యాక్ గ్రౌండ్ అందించగా.. పాటలను మాదవపెద్ది సురేశ్ సమకూర్చారు. స్మితా మాధవ్ సీత పాత్రను పోషించగా.. స్వాతి రావణుడిగా నటించారు.,మొదటి సినిమాలో రామ్‌గా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్.. అనంతరం ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించారు. ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీమ్‌గా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విధంగా రామ్ నుంచి భీమ్ వరకు తన నటనా పాటవంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టును పచ్చాజెండా ఊపారు. దీని తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు., , ,