NTR Baadshah Re Release Date: థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ అవుతోన్న ఎన్టీఆర్ బాద్‌షా-ntr baadshah movie release in theaters on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Baadshah Movie Release In Theaters On This Date

NTR Baadshah Re Release Date: థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ అవుతోన్న ఎన్టీఆర్ బాద్‌షా

Nelki Naresh Kumar HT Telugu
Nov 10, 2022 10:59 AM IST

NTR Baadshah Re Release Date: అగ్ర హీరో ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో రూపొందిన బాద్‌షా మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్న‌ది. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

NTR Baadshah Re Release Date: టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ హ‌వా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు పోకిరి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా, బాల‌కృష్ణ చెన్న‌కేశ‌వ‌రెడ్డి, ప్ర‌భాస్ బిల్లాతో పాటు ప‌లు సినిమాలు థియేట‌ర్ల‌లో రీ రిలీజై భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. తాజాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి ఎన్టీఆర్ సినిమా చేరింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాద్‌షా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నెల 19న బాద్‌షా రీ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ శ్రీనువైట్ల క‌ల‌యిక‌లో తొలిసారి రూపొందిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ సినిమాలో బ్ర‌హ్మానందం కామెడీ ప్రేక్ష‌కుల్ని అల‌రించింది.

బాద్‌షా అనే మాఫియా డాన్‌గా, రామారావు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ క‌నిపించి అల‌రించారు. క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేష్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీనువైట్ల కెరీర్‌లో చివ‌రి హిట్‌గా బాద్‌షా నిలిచింది.

ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను మ‌ళ్లీ ఈ నెల 19 థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌క‌లు ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాత న‌ట్టికుమార్‌. 4కే టెక్నాల‌జీతో ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌నున్నారు.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో బాద్‌షా రీ రిలీజ్ కానుంది. త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. బాద్‌షా మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ అందించ‌గా సిద్ధార్థ్ అతిథి పాత్ర‌లో క‌నిపించాడు. మీనాక్షి దీక్షిత్ ఐటెంసాంగ్‌లో న‌టించింది.

IPL_Entry_Point