Ntr Ram Charan - Oscars Panel: ఆస్కార్ ప్యానల్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ - తొలి తెలుగు యాక్టర్స్‌గా అరుదైన ఘనత
Ramcharan Ntr - Oscar Members: ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ఆస్కార్ ప్యానల్‌లో మెంబర్స్‌గా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఘనతను దక్కించుకున్న తొలి తెలుగు హీరోలుగా నిలిచారు.
Ramcharan Ntr - Oscar Members: ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆస్కార్ ప్యానల్‌లో మెంబర్స్‌గా చేరే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో ఆస్కార్ విన్నర్స్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌లు ఉన్నారు. వీరితో పాటు మణిరత్నం, కరణ్‌జోహార్‌లకు స్థానం దక్కింది. 2023 -24 ఏడాదికిగాను ఆస్కార్స్ ప్యానెల్ కమిటీ మెంబర్స్‌గా 398 మందికి అకాడెమీ ప్రతినిధులు ఆహ్వానాలు పంపారు.
ఇన్విటేషన్స్ అందిన వారి జాబితాలో టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లున్నారు. ఆస్కార్స్ నుంచి ఆహ్వానాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోలుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ అరుదైన రికార్డ్ నెలకొల్పారు. వీరితో పాటు ఆస్కార్ విన్నర్స్, ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌లకు ఆహ్వానాలు అందాయి.
ఆస్కార్ ప్యానల్ నుంచి ఇన్విటేషన్స్ అందిన వారి జాబితాలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్‌తో పాటు మణిరత్నం,కరణ్ జోహార్, సిద్దార్థ రాయ్ కపూర్, షౌనక్ సేన్, చైతన్య తమ్హనేతో పాటు మరికొందరు ఇండియన్ సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ సభ్యుల జాబితా వివరాల్ని ఆస్కార్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
సినిమా మాధ్యమం ద్వారా ప్రపంచస్థాయిలో ప్రతిభను చాటుకొన్న వారిని సభ్యులుగా ఇన్వైట్ చేస్తోన్నట్లు ప్రకటించింది. కాగా 94వ ఆస్కార్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును గెలుచుకొని చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ పురస్కారాన్ని దక్కించుకున్నతొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన ఇద్దరు పోరాటయోధుల కథతో దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్‌గణ్, శ్రియా కీలక పాత్రలను పోషించారు.