Harish Shankar: ‘కొత్తగా ఏముంది’: మిస్టర్ బచ్చన్‍కు మిక్స్డ్ టాక్‍పై స్పందించిన హరీశ్ శంకర్.. ఓ వైరల్ ఫొటోపై క్లారిటీ-nothing new director harish shankar on mixed reviews for mr bachchan movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harish Shankar: ‘కొత్తగా ఏముంది’: మిస్టర్ బచ్చన్‍కు మిక్స్డ్ టాక్‍పై స్పందించిన హరీశ్ శంకర్.. ఓ వైరల్ ఫొటోపై క్లారిటీ

Harish Shankar: ‘కొత్తగా ఏముంది’: మిస్టర్ బచ్చన్‍కు మిక్స్డ్ టాక్‍పై స్పందించిన హరీశ్ శంకర్.. ఓ వైరల్ ఫొటోపై క్లారిటీ

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 15, 2024 08:34 PM IST

Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ హరీశ్ శంకర్ నేడు స్పందించారు. మిస్టర్ బచ్చన్ సక్సెస్ మీట్‍లో ఆయన మాట్లాడారు. అలాగే, ఈ చిత్రానికి సంబంధించిన వైరల్ అవుతున్న ఓ ఫొటోపై కూడా వివరణ ఇచ్చారు.

Harish Shankar: ‘కొత్తగా ఏముంది’: మిస్టర్ బచ్చన్‍కు మిక్స్డ్ టాక్‍పై స్పందించిన హరీశ్ శంకర్
Harish Shankar: ‘కొత్తగా ఏముంది’: మిస్టర్ బచ్చన్‍కు మిక్స్డ్ టాక్‍పై స్పందించిన హరీశ్ శంకర్

మిస్టర్ బచ్చన్ సినిమా మంచి హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 15) థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, బుధవారమే (ఆగస్టు 14) కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. చిత్రంపై రిలీజ్‍కు ముందు డైరెక్టర్ హరీశ్ శంకర్ చాలా నమ్మకం వ్యక్తం చేశారు. తప్పక హిట్ అవుతుందని అన్నారు. అయితే మిస్టర్ బచ్చన్ చిత్రానికి మొదటి నుంచే మిస్టర్ బచ్చన్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.

మిస్టర్ బచ్చన్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నా.. నేడు సక్సెస్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. మీడియాతో మాట్లాడారు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ క్రమంలో మిక్స్డ్ టాక్ రావడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన స్పందించారు.

కొత్తేం కాదు

మిక్స్డ్ రివ్యూలు కొత్తేం కాదని, ఇప్పటికే చాలా సినిమాలకు వచ్చాయని హరీశ్ శంకర్ తెలిపారు. షోలు సాగుతున్న కొద్ది మిస్టర్ బచ్చన్ మూవీకి టాక్ మారుతోందని ఆయన అన్నారు. “మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చాయి. కొత్తగా ఏముంది. నాకు నచ్చినవి కూడా ట్వీట్ చేశా. ఇది కూడా సమానంగానే ఉంది. ఇదేం కొత్తకాదు. షోల తర్వాత టాక్ పెరుగుతోంది. తర్వాత సెలవులు ఉన్నాయి. సినిమా మా అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. మా అంచనాలు దాటాలని కోరుకుంటున్నాం” అని హరీశ్ శంకర్ అన్నారు.

ఆ ఫొటోపై క్లారిటీ

మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార పాటలో డ్యాన్స్ మూవ్‍మెంట్‍లో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‍ను రవితేజ ముందు నుంచి పట్టుకునే స్టెప్ ఉంది. అయితే, అభ్యంతకరంగా ఉందంటూ ఈ స్టెప్‍కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై హరీశ్ శంకర్ స్పందించారు. డ్యాన్స్‌ మూవ్‍మెంట్‍ను పాస్ చేసి.. ఫొటోగా చూస్తే ఇబ్బంది కలిగేలా చేయవచ్చని అన్నారు.

ఈ పాటను మూవీ తొలి రోజే షూట్ చేశామని హరీశ్ శంకర్ తెలిపారు. శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద కొరియోగ్రాఫర్‌కు షూట్ ఫస్డ్ డేనే తాను చెప్పలేకపోయానని అన్నారు. “అది ఫస్ట్ డే షూట్. డ్యాన్స్ మూవ్‍మెంట్లు.. మూవ్‍లో వెళ్లిపోతే చూసేందుకు ఎబ్బెట్టుగా అనిపించవు. ఎప్పుడైతే మూవ్‍మెంట్‍ను పాస్ చేసి ఫొటోలాగా తీస్తే.. ఏ పాటలో చూసినా ఇబ్బంది కలిగేలా చేయవచ్చు. శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూట్. ఇది పెద్దగా అవసరం లేదని నాకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే వద్దంటే ఆయన నిరాశపడతారని అనుకున్నా” అని హరీశ్ శంకర్ తెలిపారు.

ఈ పాట సమయంలో ఫస్ట్ డే షూటింగ్ హడావుడిలో తాను ఉన్నానని హరీశ్ శంకర్ తెలిపారు. “ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్‍లో నేను ఉన్నా. ఆ రిహార్సల్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. ఈ పాటకు ఈ మూవ్‍మెంట్ అవసరం లేదనిపించింది. చాలా మంచి లిరిక్స్‌తో వెళుతోంది పాట. కానీ డ్యాన్స్ మూవ్‍లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది” అని హరీశ్ శంకర్ వివరణ ఇచ్చారు.

బాలీవుడ్ మూవీ రైడ్‍కు రీమేక్‍గా మిస్టర్ బచ్చన్ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కించారు. చాలా మార్పులతో తీసుకొచ్చారు. ఈ చిత్రంలో ఇన్‍కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా రవితేజ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.