Urvashi Rautela: డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్లో ఊర్వశి మిస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు-no urvashi rautela on daaku maharaj netflix ott release posters netizens reacting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Urvashi Rautela: డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్లో ఊర్వశి మిస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Urvashi Rautela: డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్లో ఊర్వశి మిస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 17, 2025 02:19 PM IST

Urvashi Rautela - Daaku Maharaj OTT: డాకు మహారాజ్ ఓటీటీ డేట్ వచ్చేసింది. దీనికోసం ఓ పోస్టర్‌ను కూడా ఓటీటీ ప్లాట్‍ఫామ్ రివీల్ చేసింది. ఇందులో ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన అందరూ ఉండగా.. ఊర్వశి రౌతేలా మిస్ అయ్యారు.

Urvashi Rautela: డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్లో ఊర్వశి మిస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Urvashi Rautela: డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్లో ఊర్వశి మిస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ కీలకపాత్ర చేశారు. ఓ పాటలోనూ జోష్‍గా చిందేశారు. ఈ మూవీ ప్రమోషన్లలోనూ జోరుగా పాల్గొన్నారు ఊర్వశి. ఈ మూవీ సక్సెస్ పార్టీల్లోనూ సందడి చేశారు. డాకు మహరాజ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇటీవల వెల్లడి కాగా.. పోస్టర్లో ఊర్వశి మిస్ అయ్యారు. దీనిపైనే నెటిజన్లు నుంచి ఫన్నీ రియాక్షన్లు వస్తున్నాయి.

ఊర్వశి ఎక్కడ!

డాకు మహరాజ్ చిత్రం స్ట్రీమింగ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు పోస్టర్ తీసుకొచ్చింది. ఈ పోస్టర్లో హిరో నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారు. అయితే, కీలక పాత్ర చేసిన ఊర్వశి మాత్రం లేరు. దీంతో ఊర్వశి ఎక్కడ అంటూ కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

ఫన్నీ కామెంట్లతో..

డాకు మహరాజ్ ఓటీటీ పోస్టర్లో ఊర్వశి రౌతేలా లేకపోవడంతో చాలా మంది స్పందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‍పై జరిగిన దాడి గురించి స్పందించాలని ఓ సందర్భంలో మీడియా అడిగితే.. డాకు మహరాజ్ సక్సెస్ కావడంతో తన తల్లి రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారని ఊర్వశి చెప్పారు. అప్పట్లో ఆమెపై ట్రోలింగ్ బాగా జరిగింది. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ తీసుకొచ్చిన డాకు మహరాజ్ పోస్టర్లో ఊర్వశి లేకపోవటంతో నెటిజన్లు క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు.

“ప్రధాన పాత్ర పోషించిన నటి ఎక్కడ?” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మిస్ రోలెక్స్ ఎక్కడ? అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. సూపర్ హిట్ అయిన సినిమా ఓటీటీ పోస్టర్‌పై లీడ్ యాక్టర్ లేరేంటి అని మరికొందరు కామెంట్లు చేశారు. “ఊర్వశి మీరు ఈ సినిమాలో ఉన్నారు కదా?. పోస్టర్లో మీరు కనపడడం లేదు” అని వెటకారంగా ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇలా ఊర్వశి రౌతేలాను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజై బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈ మూవీలో బాలకృష్ణ యాక్షన్‍తో అదరగొట్టారు. బాబీ డియోల్ నెగెటివ్ రోల్ చేశారు. ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేసిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో ఎస్ఐ జానకి పాత్ర పోషించారు ఊర్వశి. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి కీరోల్స్ చేశారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం