Paruvu Web Series: నివేతా పేతురాజ్‌తో చిరంజీవి కూతురు వెబ్‌సిరీస్ - పరువు హత్యల నేపథ్యంలో...స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Paruvu Telugu Web Series: తెలుగులో నివేతా పేతురాజ్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ చేస్తోంది. పరువు టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Paruvu Telugu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్‌సిరీస్‌తో (Web Series) తెలుగులోకి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నది నివేతా పేతురాజ్.. ఓ క్రైమ్ డ్రామా సిరీస్ చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు పరువు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. జీ 5 ఓటీటీలో పరువు వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారు.
నరేష్ అగస్త్య కీలక పాత్ర...
పరువు వెబ్ సిరీస్‌లో నివేతా పేతురాజ్‌తో పాటు నరేష్ అగస్త్య కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కు డైరెక్టర్ పవన్ సాదినేని షో రన్నర్‌గా వ్యవహరిస్తోన్నాడు. గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది.
హానర్ కిల్లింగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సందేశాత్మక కథాంశంతో ఈ సిరీస్ రూపొందుతోన్నట్లు సమాచారం. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని అంటున్నారు. నివేతా పేతురాజ్ క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని అంటున్నారు.
వీడియో వైరల్…
ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను ఓ వీడియో ద్వారా డిఫరెంట్ మేకర్స్ రివీల్ చేయబోతున్నట్లు తెలిసింది. నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) పోలీసులతో గొడవ పడుతున్నఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో నివేతా పేతురాజ్ కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయడానికి డిక్కీ ఓపెన్ చేయాలని కోరినట్లుగా చూపించారు. అందుకు నివేతా పేతురాజ్ ఒప్పుకోలేదు. పోలీసులపై ఫైర్ అయ్యింది.
ఇది మా కుటుంబ పరువుకు సంబంధించినది. డిక్కీలో ఏం లేవు. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు అంటూ నివేతా పేతురాజ్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. తన మాటలను రికార్డ్ చేస్తోన్న వారిపై "ఎందుకు రికార్డ్ చేస్తున్నారు.. ఆపండి" అంటూ కోపంగా నివేతా వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇదంతా పరువు వెబ్‌సిరీస్ ప్రమోషన్స్ కోసమే చేసిన వీడియో అని సమాచారం. త్వరలోనే ఈ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారానే పరువు వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తారని అంటున్నారు.
శ్రీవిష్ణు మూవీతో ఎంట్రీ...
శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్‌కు దూరంగా ట్రెడిషనల్ అమ్మాయిగా ఈ సినిమాల్లో నాచరల్ యాక్టింగ్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, సాయిపల్లవి విరాటపర్వం సినిమాల్లో నివేతా పేతురాజ్ గెస్ట్ రోల్స్ చేసింది.
విశ్వక్‌సేన్‌తో రెండు సినిమాలు...
విశ్వక్‌సేన్ జోడీగా పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తమ కెమిస్ట్రీతో ఈ జోడీ ఆకట్టుకున్నారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. పరాజయాల కారణంగా తెలుగులో నివేతాకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.మరోవైపు సినిమాల కంటే సిరీస్‌లతోనే దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నాడు పవన్ సాదినేని. తెలుగులో దయా, కమిట్‌మెంటల్, ఈ ఆఫీస్‌లో, పిల్లా అనే వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించాడు పవన్ సాదినేని.