Kaala OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన న్యూ క్రైమ్ థ్రిల్లర్.. విశ్వక్ సేన్ బ్యూటి సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kaala Web Series OTT Streaming: ఓటీటీలోకి ఎప్పుడూ ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ సందడి చేస్తూనే ఉంటుంది. అలా తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాలా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాని వివరాలు చూస్తే..
శ్రీ విష్ణు మెంటల్ మదిలో సినిమాతో తెలుగు వాళ్లకు హీరోయిన్‍గా పరిచయమైన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj).ఈ మూవీ తర్వాత బ్రోచెవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో సినిమాల్లో తళుక్కుమంది.
ట్రెండింగ్ వార్తలు
రెడ్ మూవీలో పోలీస్‍గా, విరాటపర్వంలో కీలక పాత్రతో అలరించిన గ్లామర్ బ్యూటి నివేదా పేతురాజ్.. విశ్వక్ సేన్‍తో పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాలతో ఆకట్టుకుంది. అలాగే బ్లడీ మేరీ, బూ చిత్రాలతో ఓటీటీల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇలా సినిమాలతో బిజీగా ఉన్న నివేదా పేతురాజ్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ కాలా (Kaala 2023). క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసుగా రూపొందిన కాలాకు బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు.
పాపులర్ టీ సిరీస్ బ్యానర్‍పై భూషణ్ కుమార్, కిరణ్ కుమార్, బిజాయ్ నంబియార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నివేదా పేతురాజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రోల్ చేసింది. పలు యాక్షన్ సీక్వెన్లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
కాలా వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‍లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
కాలా వెబ్ సిరీసులో అవినాష్ తివారీ హీరోగా చేశాడు. ఇక రోహన్ వినోద్ మెహ్రా, నితిన్ గులాటి, అనిల్ ఛటర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే నివేదా పేతురాజ్ చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతోపాటు ఓ తెలుగు వెబ్ సిరీస్ ఉంది.
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వాట్సాప్ ఛానెల్‌లో చేరి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందండి. ఈ కింది లింక్ ద్వారా మా ఛానెల్‌లో చేరండి. https://whatsapp.com/channel/0029Va4xSjy7j6fy4CkcCF0b