Tollywood Heroine: విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - ఇన్‌స్టా నుంచి భర్త పేరు డిలీట్
Tollywood Heroine: టాలీవుడ్ హీరోయిన్ నీతి టేలర్ విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఇన్‌స్టా అకౌంట్ నుంచి భర్త పేరును తొలగించింది నీతి టేలర్. తెలుగులో మేం వయసుకు వచ్చాం, పెళ్లిపుస్తకంతో పాటు మరో సినిమా చేసింది నీతి టేలర్.
Tollywood Heroine: టాలీవుడ్ హీరోయిన్ నీతి టేలర్ భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ నుంచి భర్త పేరును నీతి టేలర్ డిలీట్ చేసింది. విడాకుల తీసుకోవడం వల్లే భర్త పేరును ఆమె తొలగించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఆర్మీ ఆఫీసర్‌తో...
పరీక్షిత్ భవా అనే ఆర్మీ ఆఫీసర్‌ను 2020లో పెళ్లిచేసుకుంది నీతి టేలర్. కోవిడ్ కారణంగా కేవలం కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత తన పేరు నీతి భవాగా మార్చుకుంది.
భర్తకు దూరంగా...
మూడేళ్ల పాటు సజావుగా సాగిన వారి కాపురంలో ఆ తర్వాత కలతలు వచ్చినట్లు సమాచారం. చాలా కాలంగా భర్తతో నీతి టేలర్ దూరంగా ఉంటోన్నట్లు చెబుతోన్నారు. ఇటీవలే ఇన్‌స్టా నుంచి భర్త ఇంటి పేరును నీతి టేలర్ తొలగించింది. నీతి భవా అనే పేరును తిరిగి నీతి టేలర్‌గా మార్చుకుంది. విడాకుల వల్లే భర్త ఇంటి పేరును తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి నీతి టేలర్ తీసేసినట్లు వార్తలొస్తున్నాయి.
పుకార్లపై రియాక్ట్...
విడాకుల వార్తలపై నీతి ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. ఏం జరగనప్పుడు స్పందించాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేసింది. ఆమె రియాక్షన్‌ను బట్టి విడాకుల వార్తలు నిజమేనంటూ చెబుతోన్నారు.
మేం వయసుకు వచ్చాం...
మేం వయసుకు వచ్చాం మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నీతి టేలర్. త్రినథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో తనీష్ హీరోగా నటించాడు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. ఓ యువ జంట ప్రేమకు కుల, మత అంతరాలు ఎలా అడ్డుగోడగా నిలిచాయనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
పెళ్లి పుస్తకం...
ఆ తర్వాత తెలుగులో పెళ్లిపుస్తకం, లవ్ డాట్‌కామ్ సినిమాలు చేసింది నీతి టేలర్. ఈ రెండు సినిమాలు పరాజయాలుగా నిలవడంతో ఆమెకు ఆఫర్స్ రాలేదు. దాంతో టాలీవుడ్‌కు దూరమైంది.
సీరియల్స్...
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు హిందీలో సీరియల్స్ చేసింది. ప్యార్ కా బంధన్ సీరియల్‌లో నందిని పాత్ర నీతి టేలర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. గులాం, సావ్‌దాన్ ఇండియా, లాల్ ఇష్క్, బడే అచ్చే లగ్‌తా హై, ఇష్క్‌బాజ్‌తో పాటు హిందీలో పలు సీరియల్స్ చేసింది. బిగ్‌బాస్, ఖత్రా ఖత్రా ఖత్రా, ప్యార్ తునే క్యా కియా వంటి రియాలిటీ షోస్‌లో పాల్గొన్నది.
టాపిక్