Romantic Comedy OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నిత్యా మీనన్ తమిళ మూవీ.. తెలుగు సహా 5 భాషల్లో స్ట్రీమింగ్
Kadhalikka Neramillai OTT: కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. నిత్యా మీనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీని మరికొన్ని గంటల్లో ఓటీటీలో చూడొచ్చు. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ కాదలిక్క నేరమిళ్లై చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైంది. రవి మోహన్ (జయం రవి), నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మోడ్రన్ రిలేషన్లతో కూడిన కామెడీ మూవీగా ప్రశంసలు పొందింది. ఈ మూవీ నెల ముగియకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
స్ట్రీమింగ్ వివరాలివే
కాదలిక్క నేరమిళ్లై చిత్రం రేపు (ఫిబ్రవరి 11) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు నెట్‍ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది. థియేటర్లో తమిళంలో ఒక్కటే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో వస్తుండటంతో మంచి క్రేజ్ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రి నుంచి అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలుకానుంది.
నాలుగు వారాల్లోనే..
కాదలిక్క నేరమిళ్లై చిత్రం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి వస్తోంది. రిలీజ్‍కు ముందే మంచి ధరకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ జరిగింది.
కాదలిక్క నేరమిళ్లై మూవీకి కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు. కామెడీ, ప్రస్తుత జనరేషన్ రిలేషన్‍షిప్స్ కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఐవీఎఫ్‍లో జరిగే గందరగోళం, ఆ తర్వాత ఏర్పడే బంధాల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో రవి మోహన్, నిత్యతో పాటుయోగి బాబు, లాల్, వినయ్ రాయ్, జాన్ కొక్కెన్, టీజే భాను, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని కీలకపాత్రలు పోషించారు.
కాదలిక్క నేరమిళ్లై చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్స్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ప్రొడ్యూజ్ చేశారు. గవెమిక్ ఆరీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి లారెన్స్ కిశోర్ ఎడిటింగ్ చేశారు.
నెట్‍ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సత్తాచాటుతోంది. ప్రస్తుతం ఇండియాలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. గ్లోబల్‍గానూ టాప్-10లో ఉంది. గత డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం జనవరి 30న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, కన్నడలో పుష్ప 2 రాగా.. తాజాగా ఇంగ్లిష్‍లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపేస్తోంది.
సంబంధిత కథనం