ఓటీటీలోకి ఒకేరోజు థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. జులై 4న థియేటర్లలో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు, సిద్ధార్థ్ చేసిన 3 బీహెచ్‌కే రెండు సినిమాలు విడుదల అయ్యాయి.
అయితే, వీటిలో ఒకటి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంటే మరోకొటి మాత్రం నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్, 3 బీహెచ్‌కే ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ్ముడు, 3 బీహెచ్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హీరో నితిన్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రమే తమ్ముడు. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఇద్దరు హీరోయిన్స్‌గా చేసిన తమ్ముడు సినిమాలో మలయాళ బ్యూటి స్వాసిక మరో కీలక పాత్ర పోషించింది.
ఇక తమ్ముడు ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇదివరకే నిర్మాత దిల్ రాజు తెలిపారు. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ వంటి ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో తమ్ముడు ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం.
ఇక ఇదే జులై 4న థియేటర్లలో విడుదలైన మరో సినిమా 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ హీరోగా నటించిన 3 బీహెచ్‌కే సినిమాలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్, దేవయాని, తమిళ సెన్సేషన్ మీఠా రఘునాథ్ కీలక పాత్రలు పోషించారు. తల్లిదండ్రులుగా శరత్ కుమార్-దేవయాని, అన్నాచెల్లెలిగా సిద్ధార్థ్-మీఠా రఘునాథ్ యాక్ట్ చేశారు.
శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన 3 బీహెచ్‌కే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా చాలా బాగుందని, చాలా వరకు హై ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని, ప్రభు పాత్రలో సిద్ధార్థ్‌తోపాటు మిగతా నటీనటులు ఎంతగానో మెప్పించారని రివ్యూస్ వచ్చాయి.
ఈ నేపథ్యంలో 3 బీహెచ్‌కే ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అమెజాన్ ప్రైమ్ లేదా సన్ నెక్ట్స్‌లో 3 బీహెచ్‌కే ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ వంటి ఐదు భాషల్లో 3 బీహెచ్‌కే ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
అంతేకాకుండా, ఆగస్ట్ మొదటి వారంలో 3 బీహెచ్‌కే ఓటీటీ రిలీజ్ కానుందని బాలీవుడ్ యూట్యూబర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాతోపాటు నితిన్ తమ్ముడు మూవీ కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్