Nithin: పవన్ కల్యాణ్ మూవీ టైటిల్, డైరెక్టర్‌తో హీరో నితిన్ సినిమా.. హీరోయిన్ లయ రీఎంట్రీ
Nithin Thammudu First Look: హీరో నితిన్ నటిస్తున్న మరో సినిమా తమ్ముడు. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్న నితిన్ తమ్ముడిగా అలరించనున్నాడు.
Nithin Thammudu First Look: హీరో నితిన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే క్రేజీ కాంబినేషన్‌లో రాబిన్ హుడ్ సినిమాను నితిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టైటిల్‌తో నితిన్ రానున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టకున్న సంగతి తెలిసిందే.
తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి క్రేజీ కాంబినేషన్‌లో ఓ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. యూత్ స్టార్ నితిన్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు కలయికలో రూపొందుతోన్న చిత్రం తమ్ముడు. శ్రీరామ్ వేణు ఇంతకుముందు నేచురల్ స్టార్ నానితో ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమాలు చేశారు. ప్రస్తుతం నితిన్ తమ్ముడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే మార్చి 30 శనివారం హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు సినిమా నుంచి టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
తమ్ముడు టైటిల్ లోగో, పోస్టర్ చూస్తుంటే చాలా క్రియేటివ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్పెషల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్నీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి యూనిక్‌గా రూపొందుతోంది. తమ్ముడు చిత్రంలో నితిన్ లుక్ చాలా కొత్తగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తున్నారు.
టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గత చిత్రాలకు భిన్నంగా నితిన్ ఈ చిత్రంతో మెప్పించబోతున్నారని తెలుస్తుంది. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ వేణు రొటీన్‌కు భిన్నంగా ఎంటర్‌టైనర్‌తో మెప్పించనున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాపర్‌గా వర్క్ చేస్తున్నారు. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
దిల్, శ్రీనివాస కల్యాణం వంటి సినిమాల తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా తమ్ముడు. అలాగే నానితో ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ బ్యానర్‌లో చేస్తున్న మూడో చిత్రమిది. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌తో రాబోతున్న సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో విడుదల తేది, సంబంధిత వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇదే కాకుండా, హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో రూపొందిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. ఈ ప్రాజెక్ట్ కోసం రెండోసారి చేతులు కలిపారు నితిన్, వెంకీ కుడుముల. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ గ్లింప్స్‌ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. అది కూడా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.
టాపిక్