Robinhood: రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.. ఇది ఊహించలేదు.. అది ఆశించకూడదు.. పుష్ప 2 నిర్మాత కామెంట్స్
Robinhood Producer Y Ravi Shankar On Dubbing Movies Release: నితిన్, శ్రీలీల జంటగా నటించిన మరో సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్ ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల నిర్వహించిన రాబిన్‌హుడ్ ప్రెస్ మీట్‌లో రవిశంకర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.
Robinhood Producer Ravi Shankar Dubbing Movies: పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ మూవీస్‌తో అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు నవీన్ యెర్నేని, వై రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన మరో సినిమా రాబిన్‌హుడ్. నితిన్, శ్రీలీల మరోసారి జంటగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.
రాబిన్‌హుడ్ ప్రెస్ మీట్‌లో
రాబిన్‌హుడ్ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రాబిన్‌హుడ్ ఇవాళ (మార్చి 28) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా రాబిన్‌హుడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ స్పీచ్‌తో అలరించిన మూవీ టీమ్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.
హార్డ్ వర్క్ చేశాం
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా రిలీజ్ కానుంది. మొత్తం అవుట్‌పుట్ చూసుకున్నాం. వెరీ హ్యాపీ. ఆడియన్స్ అందరూ సినిమా చూసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని నమ్మకం ఉంది" అని అన్నారు.
ఆడియెన్స్‌కు చేరింది
పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన వై రవి శంకర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకుంది. పబ్లిసిటీ పరంగా కూడా చాలా బాగా ఆడియన్స్‌కి చేరింది. సినిమా మంచి ఫన్ ఎంటర్‌టైనర్. కచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు" అని తెలిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
నితిన్ గారు ఈ సినిమా నుంచి ఆడియన్స్ ఏమి ఆశించవచ్చు?
-ఈ సినిమాలో చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఎమోషన్ కూడా ఉంది. హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ చాలా కొత్త అనుభూతి పొందుతారు.
నితిన్ గారు శ్రీలీల గారితో వర్క్ ఎలా అనిపించింది?
-శ్రీలీలతో ఇది నా సెకండ్ ఫిల్మ్. తను చాలా స్వీట్. షూటింగ్ అంతా చాలా చక్కగా జరిగింది. తనతో ఫ్యూచర్‌లో మళ్లీ వర్క్ చేయాలని ఉంది.
రవి గారు ఈ వారం 4 సినిమాలు వస్తున్నాయి. సోలో డేట్ ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేది కదా?
-ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో ఆశించకూడదు. మేము వస్తున్నప్పుడు ఒకటే సినిమా అనుకున్నాం. కానీ, రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇది మేము ముందుగా ఊహించలేదు. ఎవరి సినిమాలు. ఎవరి డేట్లు, ఎవరి కమిట్‌మెంట్స్ వాళ్లకు ఉంటాయి. మనం చేస్తున్నప్పుడే సోలోడేట్ అని ఫిక్స్ అవ్వకుండా పోటీ తప్పదనే మైండ్‌సెట్‌తోనే దిగాలని భావిస్తాను.
రవి గారు మీ మైత్రికి బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం. ఆ డేట్ సెంటిమెంట్‌గా ఈ రిలీజ్ డేట్ ఎంచుకున్నారా?
-రంగస్థలం సమ్మర్‌లో వచ్చిన ఫస్ట్ సినిమా. ఈ సినిమా కూడా సమ్మర్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ. సినిమాకి డెఫినెట్‌గా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. పరీక్షలు ఫినిష్ అయ్యాయి. యూత్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. రంగస్థలం ఎలాంటి మ్యాజిక్ చేసిందో ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేయాలని కోరుకుంటున్నాను.
సంబంధిత కథనం