Nithin Sreeleela: ఊహించని విధంగా నితిన్, శ్రీలీల మాస్ సాంగ్.. వందల మందితో డ్యాన్స్.. కొరియోగ్రాఫర్ ఎవరంటే?-nithin sreeleela mass song with 300 dancers for extra ordinary man ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithin Sreeleela: ఊహించని విధంగా నితిన్, శ్రీలీల మాస్ సాంగ్.. వందల మందితో డ్యాన్స్.. కొరియోగ్రాఫర్ ఎవరంటే?

Nithin Sreeleela: ఊహించని విధంగా నితిన్, శ్రీలీల మాస్ సాంగ్.. వందల మందితో డ్యాన్స్.. కొరియోగ్రాఫర్ ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu

Extra Ordinary Man: నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇందులో నితిన్, శ్రీలీల మీద హై ఎనర్జీ మాస్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారట. అందుకోసం టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇంతకీ ఆయన ఎవరనే విషయంలోకి వెళితే..

300 మంది డ్యాన్సర్లతో నితిన్ శ్రీలీల మాస్ సాంగ్.. కొరియోగ్రాఫర్ ఎవరంటే?

యంగ్ హీరో నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్’. రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్ మూవీ నుంచి ‘డేంజర్ పిల్ల’, ‘బ్రష్ వేస్కో’ సాంగ్స్ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక డేంజర్ పిల్ల రింగ్ టోన్ ప్రతి ఒక్కరి మొబైల్‌లో మోగుతోంది.

ప్రస్తుతం ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్ మూవీలోని ఓ హై ఓల్టేజ్ మాస్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారట. శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్ డాన్సర్స్‌తో ఈ పాటను కంపోజ్ చేయనున్నారు. టాలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పక్కా మాస్ సాంగ్‌ను హీరో నితిన్, శ్రీలీలపై చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో విశేషంగా మారింది. ఈ పాట చిత్రీకరణతో మూవీ ఎంటైర్ షూటింగ్ పూర్తవుతుంది.

మరో వైపు ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్ టీజర్‌ సైతం అమేజింగ్‌గా ఉందంటూ అప్రిషియేషన్స్ అందుకుంది. ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్ సినిమాకు హరీస్ జయ‌రాజ్ సంగీత అందిస్తున్నారు. డా.రాజశేఖర్, సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవివర్మ, హైపర్ ఆది, వెంకటేష్ ముమ్ముడి, జగదీష్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీని శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై ఎన్.సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.