ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు. తన ఫేవరేట్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ కూడా తన సినిమాకు పెట్టుకున్నాడు. కానీ నితిన్ కు షాక్ తప్పలేదు. అతని లేటెస్ట్ సినిమా ‘తమ్ముడు’ బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయం పాలైంది. నితిన్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద తక్కువ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ చేసింది. ఈ నేపథ్యంలో తమ్ముడు మూవీ ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.
తమ్ముడు మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ పోటీపడ్డాయి. కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ కంప్లీట్ కాలేదు. ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదిరింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లోనే తమ్ముడు మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే ముందుగా అనుకున్న దానికంటే కూడా ఈ నితిన్ సినిమా త్వరలోనే ఓటీటీ బాట పట్టే ఛాన్స్ ఉంది.
జూలై 4న విడుదలైన తమ్ముడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమవడంతో, ఇప్పుడు ఓటీటీ విడుదలపై దృష్టి పెట్టారు. తాజా సమాచారం ప్రకారం 'తమ్ముడు' త్వరగానే ఓటీటీలో విడుదల కానుంది. సాధారణంగా పెద్ద తెలుగు సినిమాలు థియేట్రికల్ విడుదల తర్వాత ఒక నెల తర్వాత ఓటీటీలో విడుదల అవుతాయి. కానీ 'తమ్ముడు' జూలై 2025 చివరి వారంలో విడుదల కానుందని సమాచారం.
నితిన్ తన కెరీర్ లో అత్యంత గడ్డు స్థితిలో ఉన్నాడు. అతనికి ఇది వరుసగా నాలుగో ఫ్లాప్. ఇప్పుడు నితిన్ ఆశలన్నీ ఎల్లమ్మ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఆ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. దీనిని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మరోవైపు కన్నడ సినిమా కాంతారాతో వెలుగులోకి వచ్చిన సప్తమి గౌడ తమ్ముడు మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. మూవీ ఆమె నటనకు ప్రశంసలు దక్కినా.. ఫిల్మ్ ఫెల్యూర్ తో నిరాశ తప్పలేదు. తమ్ముడు సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కోనున్నారు. కానీ ఓటీటీ హక్కుల ద్వారా బడ్జెట్ లో కాస్తయినా వసూలు చేయనున్నారు. తమ్ముడు కథ సోదరుడు-సోదరి బంధం గురించి ఉంటుంది. నితిన్ పాత్ర తన సోదరిని కాపాడటానికి ఎలా ప్రయత్నిస్తుందనే దాని గురించి సినిమాలో ఉంది.
సంబంధిత కథనం