టాలీవుడ్ హీరో నితిన్‍కు నాలుగేళ్లుగా సరైన హిట్ లేదు. వరుస ప్లాఫ్‍లు ఎదురయ్యాయి. ఈ ఏడాది నితిన్ నటించిన రాబిన్‍హుడ్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ‘తమ్ముడు’ సినిమాపైనే గంపెడాశ పెట్టుకున్నారు నితిన్. ఈ సినిమా జూలై 4వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తమ్ముడు సినిమాకు ఓటీటీ డీల్ జరిగిందని తెలిసింది.
తమ్ముడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీపై అంచనాలు బాగానే ఉండడంతో మంచి ధరకే సొంతం చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఓటీటీ పార్ట్‌నర్ గురించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
తమ్ముడు చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెడుతుంది. జూలై 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఆగస్టులో ఈ చిత్రం ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
తమ్ముడు చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కాతమ్ముళ్ల బంధం, యాక్షన్ ఈ మూవీలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రమాదాల నుంచి అక్కను కాపాడేందుకు ఏమైనా చేసే తమ్ముడి చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉండనుందని టాక్. ఈ మూవీలో నితిన్‍కు జోడీగా కాంతార ఫేమ్ సప్తమి గౌడ నటించారు. నితిన్ అక్క పాత్రను సీనియర్ నటి లయ ఓ కీలకపాత్ర పోషించారు.
డిఫరెంట్ ప్లాన్ ఫాలో అవుతోంది తమ్ముడు మూవీ టీమ్. టీజర్, పాటల కంటే ముందు ట్రైలర్ తీసుకొచ్చేస్తోంది. నేటి (జూన్ 11) సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ట్రైలర్‌తోనే ప్రమోషన్లను మొదలుపెట్టనుంది.
తమ్ముడు చిత్రంలో కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని సమాచారం బయటికి వచ్చింది. నితిన్, సప్తమి, లయతో పాటు సౌరభ్ సచ్‍దేవ, వర్ష బొల్లమ్మ, స్వస్తిక ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు.
భీష్మ (2020) తర్వాత నితిన్‍కు బాక్సాఫీస్ సక్సెస్ దక్కలేదు. వరుసగా నిరాశ ఎదురవుతోంది. చెక్, రంగ్‍దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‍హుడ్ ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. తమ్ముడు చిత్రంతో నితిన్ మళ్లీ హిట్ ట్రాక్ పడతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైన చిత్రం ఎట్టకేలకు జూలై 4న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది.
సంబంధిత కథనం