Robinhood OTT: నితిన్, శ్రీలీల ‘రాబిన్‍హుడ్’ సినిమాకు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్-nithiin sreeleela robinhood ott digital streaming rights bagged by zee5 ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Robinhood Ott: నితిన్, శ్రీలీల ‘రాబిన్‍హుడ్’ సినిమాకు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్

Robinhood OTT: నితిన్, శ్రీలీల ‘రాబిన్‍హుడ్’ సినిమాకు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్

Robinhood OTT Platform: రాబిన్‍హుడ్ సినిమాకు ఓటీటీ డీల్ జరిగింది. ఓటీటీ పార్ట్‌నర్ ఏదో సమాచాం బయటికి వచ్చింది. శాటిలైట్ హక్కుల గురించి కూడా వెల్లడైంది. ఆ వివరాలు ఇవే..

Robinhood OTT: నితిన్, శ్రీలీల ‘రాబిన్‍హుడ్’ సినిమాకు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్‍హుడ్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. మరో నాలుగు రోజుల్లో మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ కూడా ఎంటర్‌టైనింగ్‍గా మెప్పిస్తోంది. దీంతో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ కామెడీ యాక్షన్ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ తరుణంలో రాబిన్‍హుడ్ సినిమా ఓటీటీ, శాటిలైట్ డీల్ గురించి వివరాలు బయటికి వచ్చాయి.

ఈ ప్లాట్‍ఫామ్ చేతికి స్ట్రీమింగ్ హక్కులు

రాబిన్‍హుడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందనే సమాచారం బయటికి వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం జీ5లో రానుంది. ఈ మూవీ టెలికాస్ట్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ సొంతం చేసుకుందని సమాచారం. ఇలా, రాబిన్‍హుడ్ డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ5 గ్రూప్ సొంతం చేసుకుంది.

రాబిన్‍హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ - వెంకీ కాంబోలో గతంలో వచ్చిన భీష్మ భారీ హిట్ కొట్టింది. దీంతో వీరి కలయికలో వస్తున్న రాబిన్‍హుడ్‍పై చాలా హైప్ ఉంది. అందుకు తగ్గట్టే ఈ మూవీకి ఓటీటీ హక్కుల రూపంలో జీ5 నుంచి మంచి ధరే దక్కినట్టు తెలుస్తోంది.

రాబిన్‍హుడ్ చిత్రంలో నితిన్‍కు సరసన హీరోయిన్‍గా నటించారు శ్రీలీల. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో, దేవ్‍దత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు. దీంతో మరింత క్రేజ్ నెలకొంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కూడా వార్నర్ హాజరయ్యారు.

రాబిన్‍హుడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిచిన ఈ మూవీకి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు.

బుకింగ్స్ మొదలు

రాబిన్‍హుడ్ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల జోరుగా బుకింగ్స్ సాగుతున్నాయి. క్రమంగా అన్ని చోట్ల ఈ మూవీ థియేటర్ల టికెట్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ పోటీలో ఉంది. సంతోశ్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. ఇది కూడా కామెడీ మూవీగా వస్తోంది. సూపర్ హిట్ మ్యాడ్‍కు సీక్వెల్‍గా వస్తుండంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రాబిన్‍హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీ ఆసక్తికరంగా మారింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం