నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రమోద్ నుంచి శ్వేతను కాపాడి విరాట్, చంద్రకళ తీసుకొస్తారు. జరిగింది అంతా శ్వేత చెప్పడంతో శాలిని వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దాంతో చిరాకుపడుతుంది. అనంతరం విరాట్‌కు చంద్రకళ రొమాంటిక్‌గా పెయిన్ రిలీఫ్ బామ్ రాస్తుంది.
శ్వేత వచ్చి ఇద్దరికి థ్యాంక్స్ చెబుతుంది. ఇద్దరిని పొగుడుతుంది. వేడి నీళ్లతో కాపుడం పెడితే త్వరగా తగ్గిపోతుందని శ్వేత చెప్పి వెళ్లిపోతుంది. వేడి నీళ్ల కాపడం అంటుంది ఇదివరకు పెట్టిందా అని విరాట్‌ను ఆటపట్టిస్తుంది చంద్రకళ. తమ ప్లాన్ ఫెయిల్ కావడంతో శ్యామలతో మరోసారి ట్రై చేయిస్తారు కామాక్షి, శాలిని.
శ్వేతకు ఇప్పుడు విరాట్ మీద ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకుని ఒకవేళ ఉంటే చంద్రకళను విడగొట్టేందుకు ప్లాన్ చేస్తారు. చంద్రకళ, శ్వేత ఇద్దరూ వస్తుంటే.. ఏమ్మా నువ్వెప్పుడైనా నా అల్లుడిని మిస్ అయ్యావా అని శ్యామల అడుగుతుంది. దానికి ఇద్దరు షాక్ అవుతారు. నాకు అర్థం కాలేదు, దేని గురించి అంటున్నారు అని శ్వేత అంటుంది.
విరాట్ విషయంలో నీకు ఇంకో అవకాశం దొరికేటువంటి అదృష్టం కూడా ఉంది అని శ్యామల అంటుంది. ఓ పని చేయి. నువ్వు ఇక్కడ ఒక పది రోజులు ఉండేసి వెళ్లు. అప్పుడు విరాట్ నీవైపు వచ్చే ఛాన్స్ ఉంది. తనను ఓ దరిద్రం పట్టుకుందని తెలిసి మళ్లీ నిన్నే పెళ్లి చేసుకోవచ్చు కూడా అని శ్యామల అంటుంది. ఆ మాటలు విన్న చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
చంద్రకళ ఏడవటం చూసిన విరాట్ ఏమైందని అడుగుతాడు. దాంతో జరిగింది అంతా విరాట్‌తో చెబుతుంది శ్వేత. అది తెలిసి కోపంగా అత్త శ్యామలను నిలదీస్తాడు విరాట్. శ్యామలతో కామాక్షి ఉంటుంది. విరాట్ మాట్లాడే మాటలను ఓ వైపు తల్లి జగదీశ్వరి, మరోవైపు నుంచి భార్య చంద్రకళ వింటూ ఉంటారు.
ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావ్ అత్త. ఇలా మాట్లాడి నీ స్థాయిని దిగజార్చుకుంటావనుకోలేదు అని విరాట్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. శత్రువు మీద ప్రేమ చూపించేంత గొప్ప దయా గుణం నాకైతే లేదు అని శ్యామల అంటుంది. చంద్ర కావాలని నా లైఫ్‌లోకి రాలేదు. నేనే వెళ్లి బలవంతంగా చంద్ర మీద ద్వేషంతో తాళి కట్టా అని విరాట్ చెబుతాడు.
చంద్ర తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అని కోపంగా అడుగుతుంది శ్యామల. అవును, నమ్ముతున్నాను. దయచేసి చంద్రను బాధపెట్టకండి అత్త అని చేతులెత్తి దండం పెట్టి మరి వేడుకుంటాడు విరాట్. అది చూసిన చంద్రకళ మురిసిపోతుంది. అలాగే, తల్లి జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది.
చంద్రకళపై తనకున్న నమ్మకం, ప్రేమ గురించి విరాట్ చెప్పే విధానానికి చంద్ర ఫిదా అయితే.. తల్లి జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్ని రోజులు అనవసరంగా చంద్రకళను తప్పు పడుతున్నామని ఫీల్ అవుతుంది. అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్