నిన్ను కోరి ప్రోమో: రఘురాం రిపోర్ట్స్ తారుమారు- బయటపెట్టిన అమెరికా డాక్టర్- ఒకే పరిస్థితిలో జగదీశ్వరి, శాలిని-ninnu kori today episode promo raghuram reports changed jagadeeswari shalini get fear star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి ప్రోమో: రఘురాం రిపోర్ట్స్ తారుమారు- బయటపెట్టిన అమెరికా డాక్టర్- ఒకే పరిస్థితిలో జగదీశ్వరి, శాలిని

నిన్ను కోరి ప్రోమో: రఘురాం రిపోర్ట్స్ తారుమారు- బయటపెట్టిన అమెరికా డాక్టర్- ఒకే పరిస్థితిలో జగదీశ్వరి, శాలిని

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అర్జున్ మేనేజర్ మనోహర్ కాల్ చేయడంతో చంద్రకళ ఆఫీస్‌కు వెళ్తుంది. హాస్పిటల్‌కు రఘురాంను విరాట్, శ్యామల, జగదీశ్వరి తీసుకెళ్లిపోతారు. హాస్పిటల్‌లో అమెరికా డాక్టర్ ఏం చెబుతుందో అని శాలిని వణికిపోతుంది. రఘురాం రిపోర్ట్స్ మారిపోయాయని అమెరికా డాక్టర్ చెబుతుంది.

నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రఘురాంను అమెరికా డాక్టర్‌కు చూపించేందుకు హాస్పిటల్‌కు రెడీ అవుతారు విరాట్, చంద్రకళ. శాలినికి చేయి కట్ అవడంతో క్రాంతి ఇంట్లోనే ఉంటాడు. రఘురాం రిపోర్ట్స్ తీసుకొస్తానని ఇంట్లోకి వెళ్లి వస్తుంది చంద్రకళ. ఇంతలో చంద్రకళకు అర్జున్ కొత్త మేనేజర్ మనోహర్ ఫోన్ చేస్తాడు.

అర్జంట్ వర్క్ వల్ల

నేను మనోహర్‌ను మీ కంపెనీలో మేనేజర్‌గా కొత్తగా చేరాను. పచ్చళ్ల ప్రొడక్ట్ గురించి మీతో మాట్లాడాలి. అర్జున్ గారు ఏదో అర్జంట్ వర్క్ ఉండి బయటకెళ్లారు. నాకు ఇక్కడ కొత్త కదా. ఏదైనా ఉంటే మీ హెల్ప్ తీసుకోమన్నారు. మీరు ఇక్కడికి రావాలి. మీతో ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి అని మనోహర్ అంటాడు.

దాంతో ఆలోచనలో పడిపోతుంది చంద్రకళ. నేను మా మావయ్యను అర్జంట్‌గా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. తర్వాత వస్తాను అని చంద్రకళ అంటుంది. హాస్పిటల్‌కు ఇంకెవరినైనా పంపించండి. మీరు రాకపోతే ఇక్కడ ప్రోడక్ట్ ఆగిపోతుంది. మళ్లీ ఏ తప్పు జరగకూడదు కదా. మీరు దగ్గరుండి చూసుకుంటే నేను చేయాల్సింది చేస్తాను అని మనోహర్ అంటాడు.

దాంతో బిజినెస్‌కు ఇప్పటికే నష్టం వచ్చింది. అందులోనుంచి బయట పడాలంటే నేను ఇప్పుడు వెళ్లాలి అని సరే అని చెబుతుంది చంద్రకళ. బావ కొత్త మేనేజర్ వచ్చాడు. అతనికి ప్రొడక్ట్ డీటేల్స్ చెప్పాలి. నాకు రావాలనే ఉంది. కానీ, ఇది కూడా చాలా అర్జంట్ అని చంద్రకళ అంటుంది. దానికి శ్యామల నిందిస్తుంది.

పైకే నాటకాలు

నీకు మా అన్నయ్య కోలుకోవాలని ఉంటే ఇలా ఎందుకు చేస్తావ్. అన్ని పైకి నాటకాలు మాత్రమే అని చంద్రకళను అంటుంది శ్యామల. అత్త చంద్రకళకు నిజంగానే పని పడినట్లుంది. లేకుంటే ఇలా చేయదు అని సపోర్ట్ చేస్తాడు విరాట్.

నువ్వు ఇలాగే సపోర్ట్ చేయు రేపు అన్నయ్య కోలుకున్నాకా ఎవరిని ఎక్కడ పెట్టాలో చెబుతాడు అని శ్యామల అంటుంది. దాంతో చంద్రకళ ఆఫీస్‌కు వెళ్లిపోతుంది. హాస్పిటల్‌కు రఘురాంను తీసుకుని విరాట్, జగదీశ్వరి, శ్యామల వెళ్తారు. క్రాంతి పేరు చెప్పి అమెరికా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్తారు.

రఘురాం గురించి డీటెల్స్ అన్ని అడుగుతుంది డాక్టర్. దానికి విరాట్ జరిగింది అంతా చెబుతాడు. రఘురాంను డాక్టర్ టెస్ట్ చేస్తుంది. తర్వాత విరాట్ వాళ్లతో అమెరికా డాక్టర్ మాట్లాడుతుంది. పేషంట్ పాత రిపోర్ట్స్ ఇవ్వమని అడుగుతుంది డాక్టర్. దాంతో విరాట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ మీ ఫాదర్ నేమ్ ఏమన్నారు అని అడుగుతుంది.

రాజారాం అని ఉందేంటి

రఘురాం అని విరాట్ చెబుతాడు. మరి ఇక్కడ రాజారాం అని ఉందేంటి అని డాక్టర్ అడుగుతుంది. దాంతో విరాట్, జగదీశ్వరి, శ్యామల అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ రిపోర్ట్స్ విరాట్ చూసి ఇలా ఎలా రిపోర్ట్స్ మారిపోయాయని షాక్ అవుతాడు. మీరు వేరే రిపోర్ట్స్ తీసుకొచ్చారు అని డాక్టర్ అంటుంది.

ఇవి హాస్పిటల్‌లో ఇచ్చిన రిపోర్ట్సే మేడమ్ అని జగదీశ్వరి చెబుతుంది. అయితే, హాస్పిటల్‌లోనే రిపోర్ట్స్ మారిపోయినట్లు ఉన్నాయి అని డాక్టర్ అంటుంది. దాంతో అంతా ఉలిక్కిపడతారు. శ్యామల అయితే నోరెళ్లబెడుతుంది. ఇన్ని రోజులు ఎవరివో రిపోర్ట్స్ పట్టుకుని ఆయనకు ట్రీట్‌మెంట్ ఇచ్చామా అని బాధపడుతారు.

రిపోర్ట్స్ ఎలా మారిపోయాయ్. ఎందుకు మారాయ్. ఏం జరిగింది అని జగదీశ్వరి వణికిపోతుంది. మరోవైపు శాలిని కూడా వణికిపోతుంటుంది. హాస్పిటల్‌లో రఘురాంను చూస్తే తను చేసిన పని తెలిసిపోతుందని, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని భయపడిపోతుంది. వణికిపోయే విషయంలో జగదీశ్వరి, శాలిని ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంటుంది.

చంద్రకళపై డౌట్

రూమ్ నుంచి రిపోర్ట్స్ చంద్రకళ తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటుంది శ్యామల. ఒకవేళ చంద్రకళనే రిపోర్ట్స్ మార్చిందా అని అనుమానిస్తుంది శ్యామల. అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం