నిన్ను కోరి అక్టోబర్ 6 ఎపిసోడ్: ఎక్స్ ల‌వ‌ర్ ఇష్టమేంటో చెప్పిన విరాట్‌- మళ్లీ రావొద్దు- శ్వేత‌కు జ‌గ‌దీశ్వ‌రి వార్నింగ్‌-ninnu kori today episode october 6th 2025 virat tells ex lover shweta likes jagadeeshwari warning star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి అక్టోబర్ 6 ఎపిసోడ్: ఎక్స్ ల‌వ‌ర్ ఇష్టమేంటో చెప్పిన విరాట్‌- మళ్లీ రావొద్దు- శ్వేత‌కు జ‌గ‌దీశ్వ‌రి వార్నింగ్‌

నిన్ను కోరి అక్టోబర్ 6 ఎపిసోడ్: ఎక్స్ ల‌వ‌ర్ ఇష్టమేంటో చెప్పిన విరాట్‌- మళ్లీ రావొద్దు- శ్వేత‌కు జ‌గ‌దీశ్వ‌రి వార్నింగ్‌

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 6 ఎపిసోడ్ లో శ్వేతకు ఫిష్ అంటే ఇష్టమని విరాట్ చెప్తాడు. ఫిష్ తెచ్చేలా శ్రుతిని ఇరికిస్తాడు క్రాంతి. మరోసారి విరాట్ జీవితంలోకి రావొద్దని శ్వేతకు వార్నింగ్ ఇస్తుంది జగదీశ్వరి.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 6 ఎపిసోడ్ లో శ్వేత మీ సమస్య తీరిపోయింది కదా ఇంకా ఇక్కడే ఉంటారా? వెళ్లిపోతారా? అని శ్రుతి అడుగుతుంది. అతిథిని అలా అడగడం సంస్కారం కాదని చంద్రకళ అంటుంది. ఈ రోజు ఈవెనింగ్ వెళ్లిపోతానని శ్వేత అంటుంది. అలా అయితే మీ కోసం స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేస్తా మీకు ఏది ఇష్టం చెప్పమని చంద్ర అడుగుతుంది. అప్పుడు తనకు ఫిష్ అంటే చాలా ఇష్టమని విరాట్ చెప్తాడు.

శ్రుతిని ఇరికించిన క్రాంతి

నువ్వు ఇంట్రెస్టెడ్ గా ఉన్నావు కాబట్టి చెప్పా. అంతకంటే ఎక్కువ ఊహించుకోకు అని చంద్రకళతో అంటాడు విరాట్. మా వదిన ఫిష్ కర్రీ అదరగొడుతుంది మీరు టేస్ట్ చేయాల్సిందేనని శ్వేతతో క్రాంతి అంటాడు. శ్రుతి ఖాళీగా ఉంటుంది కదా వెళ్లి ఫిష్ తెస్తుందని క్రాంతి చెప్తాడు. డ్రెస్ డిజైన్ పేరు చెప్పి శ్రుతిని వెళ్లేలా ఒప్పిస్తాడు. బావ మరి నాకేది ఇష్టమో చెప్పు అని అడుగుతుంది చంద్ర.

శ్వేతకు జగదీశ్వరి వార్నింగ్

చంద్ర దగ్గరి నుంచి కాఫీ తీసుకుని జగదీశ్వరీకి ఇచ్చేందుకు వస్తుంది శ్వేత. నేను ఎంత మంచి లైఫ్ మిస్ చేసుకున్నానో అర్థమవుతోంది. విరాట్ నా మీద కోపంగా ఉన్నా మీరు, చంద్ర అర్థం చేసుకుని ఇంట్లోకి రానిచ్చారు. విరాట్ ను చంద్ర ఒప్పించి నా సమస్య తీరేలా చేసిందని శ్వేత అంటుంది.

నువ్వు వెళ్లిపోయాక విరాట్ పిచ్చోడైపోయాడు. కొత్త జీవితం ప్రారంభించాడు. మళ్లీ ఎవరిని మోసం చేయకు. విరాట్ జీవితంలోకి మళ్లీ రాకు అని సీరియస్ గా చెప్తుంది జగదీశ్వరి. ఈ మాటలను విరాట్ వింటాడు.

శాలిని కుట్ర

బావను వదిలేసి వెళ్లి బంగారం లాంటి ఛాన్స్ శ్వేత మిస్ చేసుకుందని శ్యామలతో శాలిని అంటుంది. కానీ విరాట్ బావ ఏం చేశారని ఆయన లైఫ్ అలా ఉంది. చంద్రను ప్రేమించినా తనతో లైఫ్ బాగానే ఉందా అంటే మీకు తెలియందేముంది? చంద్ర తప్పు చేసిందని తేలితే మళ్లీ బావ ఒంటరిగా కుంగిపోతాడు. బావకు ఆయన ఫస్ట్ లవ్ దక్కి ఉంటే బాగుండేదేమో అని శ్యామలను ఆలోచించేలా చేస్తుంది శాలిని.

చేపలు అమ్ముతూ రాజ్

మార్కెట్లో అమ్మ సరోజాతో కలిసి చేపలు అమ్ముతాడు జల రాజ్. అప్పుడే అక్కడికి శ్రుతి వస్తుంది. రాజ్ తట్ట తలపై అడ్డుగా పెట్టుకుంటాడు. బేరం దగ్గర శ్రుతి, సరోజ గొడవ పెట్టుకుంటారు. అమ్మనే తూకం వేయమంటాడు రాజ్. రూ.100 దగ్గర మళ్లీ గొడవ పెట్టుకుంటారు శ్రుతి, సరోజ. మన బంగారు బాతు ఆ అమ్మాయి అని శ్రుతి వెళ్లిపోయాక చెప్తాడు రాజ్. చంద్ర, శ్వేత క్లోజ్ గా ఉండటాన్ని శాలిని తట్టుకోలేదు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం