నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో వంట పోటీలో రిజల్ట్ కోసం చంద్రకళ, శాలిని వెయిట్ చేస్తుంటారు. శ్యామల, జగదీశ్వరి ముంత మసాలాను టేస్ట్ చేస్తారు. ముంత మసాలా, శాండ్ విచ్ రెండు బాగున్నాయని చెప్తారు. ఇద్దరూ విన్ అయ్యారని శ్యామల అంటుంది. ఈ పోటీ టై అయిందని చెప్తుంది. నెక్ట్స్ టాస్క్ చెప్పే వరకూ రిలాక్స్ అవండని శ్యామల అంటుంది.
తర్వాతి టాస్క్ మాత్రం నేనే గెలుస్తా అని చంద్రకు సవాలు విసురుతుంది శాలిని. బెడ్ రూమ్ లోకి వచ్చిన చంద్రకళ.. ఏంటీ బావ నేను గెలవలేను అనుకున్నావా అని విరాట్ ను అడుగుతుంది. అంతగా టచ్ లేకపోయినా శాలిని నీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది, నువ్వు ఓడిపోవాలని కోరుకుంటున్నా అని విరాట్ అంటాడు. ప్రతిక్షణం కోపంతో తలుచుకుంటా అని విరాట్ అంటే.. ఎలా అయితే ఏంటి బావా తలుచుకుంటున్నావ్ కదా హ్యాపీ అని చంద్ర అంటుంది.
విరాట్ కు ఎక్కిళ్లు వస్తే నీళ్లు కావాలని అడుగుతాడు. కానీ చంద్ర వచ్చి సడెన్ గా ముద్దు పెడుతుంది. దీంతో ఎక్కిళ్లు ఆగిపోతాయి. ఎక్కిళ్లు ఆగిపోవాలంటే వాటర్ తాగాలి లేదా ఏదన్నా షాక్ కు గురి కావాలి అందుకే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చా అని చంద్ర అంటుంది. మరోవైపు చంద్రను దెబ్బతీయకుండా ఏం చేశారంటూ శ్రుతి, కామక్షిపై ఫైర్ అవుతుంది శాలిని.
చంద్రకళ విరాట్ కోసం ఎదురుచూస్తుంటుంది. చంద్రకళ ఒంటరిగా హాల్లో కూర్చుని ఉంటే అక్కడికి శ్యామల వచ్చి ఏంటి ఇంకా భోజనం చేయలేదా అని అడుగుతుంది. వెళ్లి భోజనం చేసి పడుకో అంటుంది. విరాట్ ఇంకా ఇంటికి రాలేదు వచ్చిన తర్వాత నేను విరాట్ ఇద్దరం కలిసి భోజనం చేస్తామని చంద్రకళ చెప్తుంది. భర్త మీద నీకు చాలా ప్రేమ ఉంది అమ్మాయి అని చంద్రకళను శ్యామల పొగిడి వెళ్లిపోతుంది.
తన గదిలోకి వెళ్లి శ్యామల పడుకుంటుంది. అందరూ వెళ్లి పడుకుంటారు. చంద్రకళ మాత్రం విరాట్ కోసం కూర్చొని ఎదురుచూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి ముగ్గురు దొంగలు వస్తారు. వాళ్ళని చూసినా చంద్రకళ వెంటనే ఇంట్లో అందర్నీ పిలుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. వాళ్ళు ఎవరు ఏంటి అని చంద్రకళ అడిగేలోపు బంగారం, డబ్బులు తీసి ఇవ్వమని బెదిరిస్తారు.
ఒక రౌడీ జగదీశ్వరి మీద చేయి వేయగానే మా అత్తయ్య గారి మీద చేయి వేస్తావా అని చంద్రకళకి చాలా కోపం వస్తుంది. ఈ రౌడీని చంద్రకళ ఎడాపెడా వాయించేస్తుంది. దానితో షాలిని కూడా చంద్రకళతో పాటు ఫైట్ చేస్తుంది. అలా శాలిని చంద్రకళ ఇద్దరు కలిసి రౌడీలను బాగా కొడతారు. అలా కొట్టడంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు.
ఇంట్లోకి దొంగలు రావడంతో అందరూ కంగారు పడతారు. కానీ పారిపోవడంతో కాస్త రిలాక్స్ అవుతారు. దొంగలు పారిపోతున్న క్రమంలో క్రాంతి, విరాట్ ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. ఆ రౌడీలను చూసి క్రాంతి, విరాట్ కూటా టెన్షన్ పడతారు. ఏమైందీ అని లోపలికి వచ్చి అడుగుతారు. జరిగిన విషయాన్ని క్రాంతి, విరాట్ కు చెప్తారు. అప్పుడు శ్యామల ట్విస్ట్ ఇస్తుంది. ఆ రౌడీలను నేనే అరేంజ్ చేశాను అని చెబుతుంది. మీకు పెట్టిన రెండో పోటీ కూడా అయిపోయిందని చెప్తుంది.
రెండో పోటీలో ఇద్దరు సమానంగా పోటీపడ్డారు అని చంద్రకళ, శాలినిని ఉద్దేశించి శ్యామల చెప్తుంది. మూడో పోటీ ఏంటనేది రేపు ఉదయం చెబుతాను అని శ్యామల అంటుంది. దానితో ఇద్దరు కోడళ్ళు వాళ్లకు తెలియకుండానే విజయం సాధించినట్లు అవుతుంది. శృతి, శాలిని, కామాక్షి ముగ్గురు మూడో పోటీకి అత్తయ్య ఏం ప్లాన్ చేస్తుందో మనం ఎలా నెగ్గాలో అని ప్లాన్ వేసుకుంటారు.
సంబంధిత కథనం
టాపిక్