నిన్ను కోరి సెప్టెంబర్ 11 ఎపిసోడ్: చంద్రకళను లాజిక్‌తో కాపాడిన శాలిని- తల్లిని కర్రతో కొట్టిన శ్రుతి- రఘురాంపై ప్రయోగం-ninnu kori serial today episode september 11th 2025 shalini defends chandrakala star maa jio hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి సెప్టెంబర్ 11 ఎపిసోడ్: చంద్రకళను లాజిక్‌తో కాపాడిన శాలిని- తల్లిని కర్రతో కొట్టిన శ్రుతి- రఘురాంపై ప్రయోగం

నిన్ను కోరి సెప్టెంబర్ 11 ఎపిసోడ్: చంద్రకళను లాజిక్‌తో కాపాడిన శాలిని- తల్లిని కర్రతో కొట్టిన శ్రుతి- రఘురాంపై ప్రయోగం

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 11 ఎపిసోడ్‌లో లాజిక్ చెప్పి చంద్రకళను కాపాడుతుంది శాలిని. చేయి పట్టుకుని మరి ఇంట్లోకి చంద్రకళను తీసుకొస్తుంది శాలిని. అది చూసి క్రాంతి శాలినికి హగ్ ఇచ్చి సంతోషిస్తాడు. కామాక్షి తలపై రెండుసార్లు కొట్టిన శ్రుతి గతం మర్చిపోయి మళ్లీ గుర్తుకు వస్తుందని చెబుతుంది.

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 11 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నాకు ఇంట్లో ఉండే అర్హత లేదా అని చంద్రకళ అడిగితే.. జగదీశ్వరి, విరాట్ సైలెంట్‌గా ఉంటారు. ఇది అన్నయ్యకు సంబంధించిన విషయం కాబట్టే నిర్ణయం నేనే తీసుకుంటాను. నువ్వు ఇంట్లో ఉండకూడదు అని శ్యామల అంటుంది. 30 రోజుల గడువు ఇచ్చారుగా. మధ్యలో వెళ్లమంటే మాట తప్పినట్లేగా అని శాలిని అంటుంది.

లాజిక్‌తో శాలిని

ఏదైనా తప్పు జరిగితే ఊరుకోను అని కూడా చెప్పాను అని శ్యామల అంటుంది. చంద్రకళను అందరూ నిందిస్తుంటే.. అత్తయ్య సంతోషించే విషయం అయితే వెంటనే చెప్పాలనుకుంటారుగా అని అందరితో అవును అని అనిపించిన శాలిని మరి చంద్రకళ చేసినదాంట్లో తప్పేముంది అని లాజిక్‌తో మాట్లాడుతుంది శాలిని. ఇప్పుడు సమాధానం చెప్పండి అని క్రాంతి అంటాడు.

మావయ్యకు అలా జరిగిందని బాధతో అంటున్నారు కానీ, చంద్ర చేసింది ఏం లేదు. ఎవరు లేనప్పుడు నడవాలని ప్రయత్నించడం మావయ్య గారి పొరపాటు. చంద్ర నీ తప్పేం లేదు. నువ్వు లోపలికి రా అని చంద్రకళకు సపోర్ట్ చేస్తుంది శాలిని. చంద్రకళ రాకపోయేసరికి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకొస్తుంది శాలిని. అలా చంద్రకళను ఇంటి నుంచి బయటకు పంపకుండా శాలిని కాపాడుతుంది.

రఘురాంను బెడ్‌పై పడుకోబెడతారు. చంద్రకళ కూర్చుని ఏడుస్తుంటుంది. శాలిని వచ్చి ఓదారుస్తుంది. ఏడవకు అని సైగ చేస్తుంది. జగదీశ్వరిని కామాక్షి భోజనం చేయమంటే చేయదు. శ్యామల వచ్చి ఏడవకు అని ఓదారుస్తుంది. మరోవైపు మొత్తానికి పెద్ద గండం గడిచింది అని శాలిని అనుకుంటుంటే క్రాంతి వచ్చి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటాడు. నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందని అంటాడు.

తల్లిని కొట్టిన శ్రుతి

అదంతా చేసింది ఇందుకోసమే. నేను మారిపోయానని నువ్ పూర్తిగా నమ్మావ్ అని శాలిని అనుకుంటుంది. మరోవైపు కర్ర తీసుకుని తల్లి కామాక్షి తలపై కొడుతుంది శ్రుతి. దాంతో కామాక్షి కళ్లు బైర్లు కమ్ముతాయ్. ఇప్పుడు నేను ఎవరో చెప్పు. మర్చిపోయావ్‌గా తలపై కొడితే గతం మర్చిపోతారు అని చెప్పిన శ్రుతి మళ్లీ తల్లి తలపై కర్రతో కొడుతుంది.

తల్లి మీద ఏంటే నీకు పగ. ఎందుకిలా కొడుతున్నావ్ అని కామాక్షి అంటుంది. నేను నీ కూతురు అని గుర్తు వచ్చిందా. అయితే నేను అనుకుంది నిజమైంది. తలపై దెబ్బ తాకి గతం మర్చిపోతే మళ్లీ అక్కడే కొడితే గతం గుర్తుకు వస్తుంది. మావయ్యకు కూడా అలాగే చేస్తా. చంద్రకళ చేసింది చెబుతాడు. అత్తయ్య చంద్రకళను పంపిస్తుంది. నాకు లైన్ క్లియర్ అవుతుంది అని శ్రుతి చెబుతుంది.

నువ్వు నీ పిచ్చి ఆలోచనలు. ఇలా తింగరి పనులు చేస్తే నేనే తలపై కొట్టి మూలన పెడతారు అని కామాక్షి అంతా వివరంగా చెబుతుంది. చంద్రకళను శాలినినే బయటకు పంపిస్తుందే. అప్పటివరకు సైలెంట్‌గా ఉండే అని వెళ్లిపోతుంది కామాక్షి. మరోవైపు శాలినికి కాల్ చేసిన డాక్టర్ డబ్బులు అందాయి. మీరు చేసిన పనిని నేను టెంపరరీగా దాచాను. కానీ, అది ఎప్పటికైనా బయటపడే అవకాశం ఉంది. ఏ క్షణంలో అయినా మీ మావయ్యలో చలనం రావొచ్చు జాగ్రత్త అని డాక్టర్ సలహా ఇస్తాడు.

అరచేతిలో కర్పూరంతో హారతి

ఇంతలో వెనుక నుంచి చంద్రకళ వస్తుంది. శాలినికి థ్యాంక్స్ చెబుతుంది. నాకు సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండాపోయింది. అలాంటప్పుడు నువ్ నావైపు నిలబడ్డావ్. నేను నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అని చంద్రకళ అంటుంది. క్రాంతి వస్తాడు. దాంతో మంచిదానిలా మాట్లాడుతుంది శాలిని.

తర్వాత దేవుడికి చేతిలో కర్పూరం వెలిగించి ఏడుస్తూ హారతి పడుతుంది చంద్రకళ. అది విరాట్ చూసి ఆపుతాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం