నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో విరాట్ తాళి కట్టడంతో ఇంటికి వెళ్తుంది చంద్రకళ. అక్కడ అంతా ఊరికి వెళ్లడానికి లగేజ్ సర్దుకుని ఉంటారు. విరాట్ తాళి కట్టిన విషయం చంద్రకళ చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. చంద్రకళ మెడలో విరాట్ కట్టిన తాళిని శ్రీరాజ్ తెంచేందుకు ప్రయత్నిస్తాడు.
తాళి మీద శ్రీరాజ్ చేయి వేయగానే పిచ్చి కొట్టుడు కొడుతుంది చంద్రకళ. దాంతో కిందపడిపోతాడు శ్రీరాజ్. అది చూసి అంతా అవాక్కవుతారు. తాళి తెంచడం అంటే భర్త ప్రాణాలు పోయినట్లే. నా భర్త జోలికి ఎవరైనా వస్తే చంపేస్తాను అని శ్రీరాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. దాంతో నీకు మేము నువ్వుల నీళ్లు వదిలేయాల్సి వస్తుంది, ఈ ఇంట్లో ఎవ్వరితోను నీకు సంబంధాలు ఉండవు. బంధాలాన్ని తెగిపోతాయి అని వరదరాజులు అంటుంది.
ఎప్పుడో తెంచుకోవాల్సింది వరదరాజులు అని పెద్దనాన్నను పేరు పెట్టి పిలుస్తుంది చంద్రకళ. బావ నీకు ఎదురు తిరిగినప్పుడే నేను బావ వెంట వెళ్లాల్సింది. నిన్ను మార్చగలను అని నా తలరాతను ఇలా మార్చుకున్నాను. ఆ ఇంటి ప్రాణం పోయే పరిస్థితికి తీసుకొచ్చాను అని చంద్రకళ బాధగా చెబుతుంది. అదృష్టం బాగుండి బతికిపోయాడు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అదృష్టం బాగుండకపోవచ్చు అని వరదరాజులు అంటాడు.
ఏంటీ చంపుతావా.. చంపు.. చంపడానికి ప్రయత్నించు. నీ వల్ల ఆ ఇంట్లో వాళ్ల నుంచి ఒక్క రక్తపు బొట్టు బయటకు వచ్చిన నా తాళిబొట్టు సాక్షిగా చెబుతున్నాను. నిన్ను నీ కొడుకును తగలబెట్టేస్తాను. నా ఒంట్లోను ఈ ఇంటి రక్తమే ఉంది. మర్చిపోకు అని వరదరాజులు చంద్రకళ వార్నింగ్ ఇస్తుంది. నాతో బంధం తెంచుకుంటున్నందుకు సంతోషించు. నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపో. గుర్తు తెచ్చుకుంటే నీకే ప్రమాదం. తెగేదాకా లాగొద్దు అని చంద్రకళ అంటుంది.
రేయ్ నా తమ్ముడు కూతురు చంద్రకళ చచ్చిపోయింది. ఊరేళ్లకా కర్మకాండ చేయాలిరా అని వరదరాజులు అంటాడు. జగదీశ్వరి ఇంటికి చంద్రకళ వెళ్తుంది. నీకు చీము, నెత్తురు రెండు లేవా. ఇంత జరిగిన ఏ మొహం పెట్టుకుని వచ్చావని కామాక్షి అంటుంది. చంద్రకళను చూసి షాక్ అయిన జగదీశ్వరి కొడుకు విరాట్‌ను పిలుస్తుంది.
ఏంట్రా ఇది.. శాశ్వతంగా తెంపేసుకున్న అని చెప్పావు కదరా. మళ్లీ ఎందుకు వచ్చిందని జగదీశ్వరి అంటుంది. ఏదో శిక్ష వేశానన్నారు కదా బావగారు. ఇదేనా శిక్ష అని శాలిని అంటుంది. మాట్లాడావేంట్రా.. తనను పంపించేయరా.. తనను చూస్తేనే నాకు కంపరంగా ఉంది అని జగదీశ్వరి అంటుంది. ఓయ్.. ఎందుకు వచ్చావ్. నేను చెప్పాను కదా నీకు నాకు ఏ సంబంధం లేదని అని విరాట్ అంటాడు.
మాటలతో చెబితే వెళ్లదు బాబు. దీన్ని అని చంద్రకళను కొట్టబోతుంది కామాక్షి. కానీ, కామాక్షి చేయి పట్టుకుని ఎదురు తిరుగుతుంది చంద్రకళ. కామాక్షి చేయి చంద్రకళ పట్టుకోవడంతో అక్కడున్న వాళ్లంత షాక్ అవుతారు. తన జోలికి వస్తే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది చంద్ర. తర్వాత తాను ఇంటి పెద్దకోడలిగా అడుగు పెట్టినట్లు చంద్రకళ చెబుతుంది. విరాట్ కట్టిన తాళి అందరికి చూపిస్తుంది చంద్రకళ. దాంతో అంతా ఉలిక్కిపడతారు. అక్కడితో నిన్ను కోరి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్